రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే... అయితే అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు... ఇప్పటికే ఒకసారి శీతాకాల సమావేశాలను వైసిపీ బహిష్కరించింది... తను పాదయాత్రలో ఉండగా, వేరే వారికి అసెంబ్లీ బాధ్యతలు ఇవ్వటం ఇష్టంలేక, ఎవరూ అసెంబ్లీకి వెళ్ళద్దు అని ఆదేశాలు జారి చేశారు... దానికి సాకుగా, ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సభకు మేము వెళ్ళము అని చెప్పారు... నిజానికి, ప్రతిపక్షంలో ఒక్కరూ లేకుండా, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోను సభ జరగలేదు... ప్రజల్లో కూడా జగన్ తీసుకున్న నిర్ణయం పై వ్యతిరేకత వచ్చింది...
అయితే, వైసీపీ సభ్యుల నిర్ణయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడారు... శాసనసభకు రావాలని, వారిని రిక్వెస్ట్ చేశారు... అయితే, ఆ ఎమ్మెల్యేలు అందరూ, మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, మేము రాలేము అని చెప్పారు... దీంతో స్పీకర్, వారికి బాధ్యతలతో పాటు, నిబంధనలు గుర్తు చేశారు... మనం అసెంబ్లీలో ప్రజా సమస్యల పై చర్చించాలి, ప్రతిపక్షంగా మీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది...వరుసగా మూడు అసెంబ్లీ సెషన్లకు హాజరుకాకపోతే.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం చట్టంలో ఉందని చెప్పారు... ఈ విషయం తెలుసుకున్న కొంత మంది వైసిపీ ఎమ్మల్యేలు అవాక్కయ్యారు... ఈ నిబంధన మాకు తెలీదు అని, మేము ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నామని వారు స్పీకర్ కి చెప్పారు...
ఈ బడ్జెట్ సమావేశాలతో కలిపి రెండు సెషన్ల బహిష్కరించినట్టు అవుతుంది... మరో సెషన్ వెళ్ళకపోతే, నిబంధనలు ప్రకారం అనర్హత వేటు వేసే అవకాశం ఉంది... ఈ లోపు, జగన్ ఎదో ఒక సాకు చెప్పి, ఎమ్మల్యేలతో రాజీనామాలు చేపిస్తారు... దీంతో తాను అసెంబ్లీకి వెళ్లక, తన ఎమ్మల్యేలని కూడా వెళ్ళనియ్యకుండా చేసారు... ఇక వీరు అసెంబ్లీకి వెళ్ళే అవకాసం కనిపించటం లేదు... జగన్, తన మూర్ఖత్వంతో, వీరి హక్కులు కుడా హరిస్తున్నారు... 2019 ఎన్నికల్లో ఎంత మంది మళ్ళీ గెలుస్తామో, మళ్ళీ అసెంబ్లీ మొఖం చూస్తామో లేదో అంటూ, వైసిపీ ఎమ్మల్యేలు బాధపడుతున్నారు..