వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు పై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మండిపడ్డారు. కోడెల శివప్రసాద్‌కు అంబటి రాంబాబు పోటీనా అంటూ కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి వైసీపీ పోటీనా?, ఆశపడొచ్చు... దురాశ ఉండకూడదని కోడెల శివప్రసాద్ అన్నారు. మీరేంటి... మీ చరిత్ర ఏంటి? అని, జనం ఓటేసి గెలిపించిన వాళ్లు అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని వైసీపీ నేతలను కోడెల ప్రశ్నించారు. ఓటేసినవారికి మీరెప్పుడైనా సమాధానం చెప్పారా?, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసా మీకు? అని కోడెల మండిపడ్డారు. భౌతికంగా దాడిపై వైసీపీ ప్రజలకు వివరణ ఇవ్వాలని కోడెల డిమాండ్ చేశారు. భయభ్రాంతులకు గురి చేసి...ఎన్ని ఎత్తుగడలేసినా ఓటర్లు చెక్కు చెదరలేదని, ఆంధ్రా ఓటర్లకు జేజేలు పలుకుతున్నానని కోడెల శివప్రసాద్‌ స్పష్టం చేశారు.

kodela 16042019

ఏపీలో చూడబోతున్నది టీడీపీ సునామీ కోడెల అన్నారు. రాష్ట్రం బాగుండాలి, మనం బాగుండాలనుకునే ఏ ఒక్కరూ కూడా జగన్‌కు ఓటేయరని కోడెల తెలిపారు. ఏపీని టీడీపీ స్వీప్‌ చేస్తుందని, జగన్‌ ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నారో ఆంధ్రవాళ్లకు తెలుసు కోడెల స్పష్టం చేశారు. ఆంధ్రవాళ్లు కుక్కలని తిట్టిన కేసీఆర్‌కు వత్తాసు పలుకుతారా? అని జగన్‌ను కోడెల ప్రశ్నించారు. పోలింగ్‌ రోజున రాత్రి 9గంటలైనా వందలాది మంది క్యూలైన్లలో వేచి ఉన్నారని, అలాంటి ఓటర్లందరికీ జేజేలు పలుకుతున్నట్టు చెప్పారు. మహిళలు, పింఛనుదారులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారని.. ఈ ఎన్నికల్లో తెదేపాకు ఓట్ల సునామీ రాబోతుందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల తర్వాత ఆయన తొలిసారిగా మంగళవారం రాత్రి గుంటూరులోని తెదేపా కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనపై వైకాపా నేతలు ఫిర్యాదు చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

kodela 16042019

‘‘ఇనిమెట్లలోని పోలింగ్‌ బూత్‌లో వైకాపా వాళ్లు చేసిన తప్పుడు పని మీరూ చేయొద్దని తెదేపా కార్యకర్తలకు చెప్పా. ఆ సమయంలో ఓర్పుతో వ్యవహరించాం. దాడిచేసి పశ్చాత్తాప పడాల్సిన వారు ఎదురు ఫిర్యాదు చేస్తారా? చంద్రబాబుకు జగన్‌కు పోటీయా? వైకాపా తెదేపాకు ఎప్పుడూ పోటీయే కాదు. ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టొచ్చు.. అధికారం కోరుకోవచ్చు. తప్పులేదు. కానీ అసెంబ్లీకి రానివాళ్లకు జీతం తీసుకొనే హక్కు ఎక్కడుంది. జీతాలు ఎందుకు ఇస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. స్పీకర్‌గా నేను నిష్పక్షపాతంగా పనిచేశాను. సంప్రదాయప్రకారం వ్యవహరించాను. కానీ, 40 ఏళ్లలో తొలిసారి భౌతిక దాడి జరిగింది. ప్రజలకు వైకాపా క్షమాపణలు చెప్పాలి. నాపై దాడి పథకం ప్రకారమే జరిగింది. వైకాపా నేతలు ఎలాంటివాళ్లో ప్రజలందరికీ తెలియాలి. ఇలాంటి దాడులను అందరూ ఖండించాలి’’ అని కోడెల అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read