జగన్ పై కోడి కత్తి దాడి, కామెడీ అవ్వటంతో, దీన్ని కొంచెం సీరియస్ చేసి, ఏపిలో అసలు శాంతి బధ్రతలు లేవు అని ప్రొజెక్ట్ చెయ్యటానికి వైసీపీ రెడీ అయ్యింది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ భారీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో శాంతిభద్రతలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అందువల్ల రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్‌తో ఆ పార్టీ పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా వైసీపీ నేతల బృందం కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గతంలో రాజీనామా చేసిన ఐదుగురు లోక్‌సభ ఎంపీలు హోం మంత్రితో సమావేశమయ్యారు.

ycp 29102018

ఈ నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్‌ పై జరిగిన కోడి కత్తి దాడి పై విచారణ జరిపించాలని, ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని జగన్‌తో సహా ఆ పార్టీ నేతలంతా పదేపదే రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్‌ మీద దాడి ఘటనపై కేంద్రసంస్థలతో దర్యాప్తు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు తమ పరిధిలోకి రాదని సీఎం చంద్రబాబు అన్నారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంలేని సంస్థ ద్వారా దాడిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకంలేదనే విషయాన్ని రాజ్‌నాథ్‌తో వివరించిన వైసీపీ నేతలు చెప్పారు. తమ విన్నపాల పట్ల రాజ్ నాథ్ సానుకూలంగా స్పందించారని... జగన్ కేసును పరిశీలిస్తానని చెప్పారని తెలిపారు.

ycp 29102018

ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రపతి రాజ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ కోరినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే అపాయింట్‌మెంట్‌పై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇవాళ సాయంత్రం లేదా మంగళవారం రాష్ట్రపతితో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తేవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే దిశగా నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు వినికిడి. జగన్‌పై జరిగిన దాడి ఘటనపై సీఎస్‌ఎఫ్ చూసుకుంటుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వైసీపీ మాత్రం దాడి ఘటనను ఏపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు వైసీపీ నేతలు ఢిల్లీలోనే మకాం వేసి కేంద్రమంత్రులు, ఇతర నేతలను కలిసి ఇదే అంశాన్ని వారి దృష్టికి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read