విజయవాడకు చెందిన స్టీల్ ఫ్యాక్టరీ వ్యాపారి, హైదరాబాద్ లో హత్యకు గురి కావటం, అన్ని వేళ్ళు వైసీపీ నేత కోగంటి సత్యం వైపు చూపటంతో, కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. నిన్న రాత్రి హైదరాబాద్ పంజాగుట్ట వద్ద తేలప్రోలు రాంప్రసాద్ పై, గుర్తు తెలియని దుండగలు కత్తులతో పొడిచి వెళ్లారు. ఆయన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లటంతో, ఈ రోజు మృత్యువుతో పోరాడి ప్రాణం విడిచారు. అయితే మృతుడి కుటుంబ సభ్యలు మాత్రం, వైసీపీ నేత కోగంటి సత్యం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు, కొండపల్లిలోగల కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీ చుట్టుూ తిరుగుతున్నాయి. పధకం ప్రకారం విజయవాడలో స్కెచ్ వేసి, హైదరాబాద్ లో చంపినట్టు తెలుస్తుంది. ప్రొఫెషనల్ గ్యాంగ్ చేత ఈ హత్య చేపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యల వివరాల ప్రకారం, కృష్ణా జిల్లా కొండపల్లిలోగల కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీలో రాంప్రసాద్, కోగంటి సత్యం భాగస్వాములు. అయితే కోగంటి సత్యం, రాంప్రసాద్ కు రూ.50 కోట్లు బాకీ పడ్డాడుని సమాచారం.

ఆ రూ.50 కోట్ల వ్యవహారం పై ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తుంది. రాం ప్రసాద్ ఎంత ఒత్తిడి చేసినా, కోగంటి సత్యం ఏమి ఇవ్వకపోవటంతో, కోర్టులో కేసువేశాడు. ఈ నేపధ్యంలోనే కోర్ట్ హియరింగ్ కు వస్తున్న టైములో, హత్యకు కోగంటి సత్యం పక్కా ప్లాన్ చేసి చంపినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే కోగంటి సత్యం నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించే రాం ప్రసాద్ హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఈ లోపే అతన్ని చంపేశారు. అయితే కుటుంబ సభ్యులు వైసీపీ నేత కోగంటి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క కోగంటి సత్యం, గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పోలీసుల ముందు లొంగిపోతానని కోగంటి చెప్తున్నట్టు సమాచారం. రాం ప్రసాద్ వల్ల తానె 70 కోట్లు నష్టపోయానని చెప్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ఓ ఓ ప్రముఖ రాజకీయ నేత ఆశ్రయంలో కోగంటి ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read