ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం కొల్‌కతా వెళ్లనున్నారు. రేపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో కొల్ కతాలో నిర్వహిస్తున్న ర్యాలీలో ఆయన పాల్గొంటారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటే ఈ ప్రదర్శనకు చంద్రబాబుతో పాటు కర్ణాటక, ఢిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద్ కేజ్రీవాల్, ఇతర పార్టీల నేతలు పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. విపక్షాల ఐక్యతను చాటే ఈ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు.
మమతాబెనర్జీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ దూరంగా ఉండగా, కాంగ్రెస్ తరఫు నుంచి మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు , కర్ణాటక, దిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద్ కేజ్రీవాల్ పాల్గొననున్నారు. అలాగే శరద్ యాదవ్, స్టాలిన్, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ హాజరుకానున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు మమతా బెనర్జీ నిర్వహించనున్నర్యాలీకి బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా హాజరుకానున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర మంచ్ అనే రాజకీయ బృందం తరఫు నుంచి ఆయన హాజరవుతున్నట్లు ప్రకటించి కమలనాథులను షాక్ లో ముంచెత్తారు.
తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 19న కోల్‌కతాలో నిర్వహించే భారీ విపక్ష సభ భాజపాకు మృత్యుగంట మోగిస్తుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సీట్ల సంఖ్య 125కు మించదన్నారు. ప్రాంతీయ పార్టీలు గెలిచే సీట్లు భాజపా స్థానాలకన్నా ఎక్కువగా ఉంటాయన్నారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తులుగా మారతాయన్నారు. సభను నిర్వహించే బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను ఆమె గురువారం పరిశీలించారు. తానేమీ చెప్పదలచుకోలేదని, విపక్ష నేతలు మాట్లాడేదే వింటానని, అంతా ఏకాభిప్రాయంతోనే జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేజ్రీవాల్, కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎంలు ఫరూఖ్‌అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్, డీఎంకే నేత స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, ఆర్‌ఎల్డీ నేత అజిత్‌సింగ్, , జేవీఎం నేత బాబూలాల్ మరాండి తదితరులు హాజరుకానున్నారు.