తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా బీసి నేతలు టార్గెట్ గా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దమనకాండ కొనసాగుతూనే ఉంది. నిన్న మునిసిపల్ ఎన్నికల సందర్భంగా, అధికార పార్టీ నేతలు ఎలా రెచ్చిపోయారో, మీడియాలో, సోషల్ మీడియాలో వీడియోలుతో సహా బయట పడిన విషయం అందరం చూసాం. అయితే, అన్ని ఆధారాలు ఉన్నా, వారిని ఏమి చేయని పోలీసులు, ఈ రోజు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసారు. నిన్న ఎన్నికల సందర్భంగా పోలీస్ విధులకు ఆయన ఆటంకం కలిగించారని అభియోగం మోపారు. ఆయన్ను అరెస్ట్ చేసి, ముందుగా వైద్య పరీక్షలు జరిపి, జిల్లా కోర్టుకు తరలించారు. అయితే కొల్లు రవీంద్రని రిమాండ్ కు పంపించి, మళ్ళీ జైలు పాలు చేయాలని, అధికార పార్టీ పన్నిన కుట్రలు పని చేయలేదు. అయితే కోర్టులో, పోలీసులకు ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా కోర్టు జడ్జి స్పందిస్తూ, పోలీసులు ప్రొసీజర్ పాటించలేదని అభిప్రాయ పడ్డారు. దీంతో కొల్లు రవీంద్రకు బెయిల్ ఇస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. ఇదే సందర్భంలో, కొల్లు రవీంద్ర కూడా ఈ కేసు విషయం పై, పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఉదయం నుంచి కొల్లు రవీంద్ర అరెస్ట్ విషయం తెలిసిన తరువాత, మచిలీపట్నంలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తూ వచ్చింది.

kollu 11032021 2

కొల్లు రవీంద్ర అరెస్ట్ సమయంలో, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కొల్లు రవీంద్ర నివాసానికి రావటం, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసే సమయంలో, అక్రమ అరెస్ట్ అంటూ అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఈ అన్ని పరిణామాలు ఉదయం నుంచి జరిగాయి. ఇక ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కలిసి, కొల్లు రవీంద్ర అక్రమ అరెస్ట్ ను ఖండించారు. అయితే నిన్న పోలింగ్ జరుగుతున్న సమయంలో, ఒక బూతు దగ్గర, వైసీపీ, టిడిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపధ్యంలో, అక్కడకు వెళ్ళిన కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకోవటం, ఆ సమయంలో ఇరువిరి మధ్య తోపులాట జరిగి, పోలీసులు తోపులాటలో కొల్లు రవీంద్ర కింద పడిపోవటంతో, ఆయన పోలీసుల తీరుకు నిరసనగా, అక్కడే నేల పైన కూర్చుని నిరసన తెలిపారు. ఈ ఘటన పై, కొల్లు రవీంద్ర, పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అంటూ, ఈ రోజు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసారు. అయితే జిల్లా జడ్జి, అరెస్ట్ సమయంలో ప్రోసిజర్ పాటించలేదని, బెయిల్ మంజూరు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read