గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న కత్తి మహేష్, అనూహ్యంగా పూనం కౌర్ పై ప్రశ్నలు అంటూ, ఆమె వ్యక్తిగత జీవితాన్ని బజారుకు లాగాడు... ఆరు ప్రశ్నలు అంటూ ఆమె వ్యక్తిగత జీవితం పై దిగజారుడు ప్రశ్నలు వేసాడు... అయితే అందులో ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది... ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పూనం ఎవరి సిఫార్సుతో నియమించారో చెప్పాలని సూటి ప్రశ్న సంధించాడు... అంటే కత్తి ఉద్దేశం, పవన్ కళ్యాణ్ చెప్తేనే, చంద్రబాబు ఆమెను ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు అని... ఒక ఇంటర్వ్యూ లో కత్తి మాట్లాడుతూ, పూనం కౌర్ గంటా శ్రీనివసరావు సిఫరుసుతో వచ్చింది అని, గంటాకు పవన్ సిఫార్సు చేసారు అని కత్తి ఆరోపణ...
అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పందిచారు... కొల్లు రవీంద్ర చేనేత శాఖకు మంత్రిగా పనిచేసిన సమయంలోనే పూనం కౌర్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అనే ప్రచారం జరిగింది... అయితే కొల్లు రవీంద్ర క్లారిటీ ఇస్తూ, నేను మంత్రిగా పని చేసిన సమయంలో ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదు. అసలు ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదు అని క్లారిటీ ఇచ్చారు... తెలంగాణాలో కూడా సామంత విషయంలో ఇలాంటి ఆరోపనే ఉంది... బ్రాండ్ అంబాసిడర్ అనే ప్రచారం జరిగింది కాని, అధికారింగా ఎక్కడా ఉత్తర్వులు లేవు... అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా, పూనం కౌర్ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రచారమే జరిగింది... ఇప్పుడు మంత్రి మాటల ప్రకారం, ఎక్కడా ప్రభుత్వం ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదు. ఇంతకీ ఆయన ఏమన్నారో కొల్లు రవీంద్ర మాటల్లోనే..
"నేను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదు. అసలు ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదు. ప్రభుత్వ పరంగా అంబాసిడర్‌ను నియమించాలనే చర్చ ఎప్పుడూ జరగలేదు. కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయన్ను కలిసి కోరారు. ఆ సమయంలో ఆయనకు చేనేత వస్త్రాలు కూడా అందించారు. అంతే తప్ప చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదు.. చేనేతకు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్ లేరు" అని ఆయన తేల్చిచెప్పారు.