దేశంలో ఏరాష్ట్రానికి మూడురాజధానులు, ఇద్దరుముఖ్యమంత్రులు లేరని, ఆ దురదృష్టం ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలను ఏలుతూ, రాష్ట్రప్రజలపాలిట డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజులు సామంతరాజుల్ని నియమిం చుకున్నట్లు, జగన్ విజయసాయిని నియమించుకున్నాడన్నారు. గతకొద్దిరోజులుగా విజయసాయి సాగిస్తున్న భూకుంభకోణలీలలు ఒక్కొక్కటిగా బయటకువస్తున్నాయని, ఆకోవలోనే మరో కుంభకోణం వెలుగుచూసిందన్నారు. విశాఖపట్నంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడంకోసం ల్యాండ్‌పూలింగ్‌విధానంలో జనవరి25న జీవోనెం-72ను విడుదలచేశారన్నారు. ఆజీవో ప్రకారం జగన్‌సర్కారు ఆక్రమించుకున్న భూములకుకూడా పరిహారం ఇవ్వడానికి సిద్ధమైందన్నారు. 10ఏళ్లకు పైగా ఆక్రమణలోఉన్నభూమికి ఎకరాకు 450గజాలు, 5 నుంచి 10 ఏళ్లమధ్యన ఆక్రమణలోఉన్న భూమికి ఎకరాకు 250 గజాలు తిరుగుభూమిని ఇస్తామని సదరు జీవోలో పేర్కొనడం జరిగిందన్నారు. ఆ జీవోప్రకారం మొత్తం విశాఖపట్నం పరిసరప్రాంతాల్లో 6వేల ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించారని, అందులోభాగంగా దాదాపు 2,400ఎకరాల ఆక్రమితభూమిని ల్యాండ్‌పూలింగ్ విధానంలో తీసుకున్నారని పట్టాభి పేర్కొన్నారు.
2,500ఎకరాల అసైన్డ్భూములను కూడా సేకరించారని, అవీఇవీ కలిపితే 5000ఎకరాలున్నాయని, సమీకరించాలనుకున్నదానిలో 80శాతంపైగా అలాంటిభూములే ఉన్నాయన్నారు. జీవో నెం-72కు ముందు జీవోనెం-294ను నవంబర్21న విడుదలచేశారని, దానిలో 10వ పాయింట్‌గా ఆక్రమితభూములను పక్కనపెడుతున్నట్లు స్పష్టంచేసిన ప్రభుత్వం , తరువాత మరోజీవోద్వారా వద్దనుకున్నవాటిపైనే కన్నేసిందన్నారు. విజయసాయి, బొత్స, జగన్మోహన్రెడ్డిలు తమనిర్ణయాన్ని రెండునెలల్లోనే ఎందుకు మార్చుకున్నారని పట్టాభి ప్రశ్నించారు. జీవోనెం-72లో స్పెషల్‌కేసు అని ఉదహరిస్తూ, దాన్ని విశాఖ నగరానికే ఎందుకు వర్తింపచేశారో, అధికారం ఆజిల్లా కలెక్టర్‌కే ఎందుకు అప్పగించారో స్పష్టంచేయాలన్నారు. విజయసాయి, జగన్‌లు రెండునెలల సమయాన్ని అడ్డంపెట్టుకొని విశాఖనగరం, చుట్టపక్కలప్రాంతాల్లోని భూములను కబ్జాచేసి, సెటిల్మెంట్లు, దందాల తో కాజేసి, వాటిని కూడా ల్యాండ్‌పూలింగ్ విధానంలోచూపి, వాటితాలూకూ, ప్రభుత్వం నుంచి ప్లాట్లను పొందడానికి ప్రయత్నంచేశారని టీడీపీనేత దుయ్యబట్టారు. జీవోల ముసుగులో 2,400ఎకరాల స్కామ్ జరిగిందని, అందుకు మూలకారకుడు విజయసా యిరెడ్డేనని, జీవోనెం-72లో ప్రత్యేకంగా విశాఖనగరాన్నే ఎందుకు చేర్చారని, ప్రభుత్వ మిచ్చిన జీవోలద్వారా విజయసాయి భూభాగోతం బట్టబయలైందన్నారు.
ఇళ్లపట్టాల ముసుగులో జిల్లాకోరకంగా జీవోలు విడుదలచేస్తూ, అధికారులకు సైతం అర్థంకాకుండా భూస్వాహాకు పాల్పడుతున్న భూబకాసురులు జగన్, విజయసాయిలే నన్నారు. ల్యాండ్ అక్విజేషన్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా 9,300ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దానిలో భాగంగా గుంటూరురూరల్‌లో ల్యాండ్ అక్విజేషన్ కింద 1100 ఎకరాలను, అర్బన్‌లో 1125ఎకరాలు కలిపి మొత్తం 2,225 ఎకరాలు తీసుకున్నారని, కృష్ణాజిల్లాలో 1800, పశ్చిమలో 900, తూర్పుగోదావరిలో 1400ఎకరాలను ల్యాండ్ అక్విజేషన్ పద్దతిలో తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖపట్నం రూరల్‌లో 280, అర్బన్‌లో48 ఎకరాలే తీసుకొని, కేవలం 320 ఎకరాలతో ఎందుకు సరిపెట్టారని కొమ్మారెడ్డి ప్రశ్నించారు. విశాఖజిల్లాలో ల్యాండ్‌పూలి ంగ్ విధానంతో చేయాల్సిన భూకుంభకోణం చేశారని, అడిగేవాడులేడుకదా అని విశాఖపై కన్నేశారన్నారు. విశాఖకేంద్రంగా వైసీపీ చేసిన భూకుంభకోణం జీవోలతో సహా బహిర్గతమైందన్నారు. విశాఖలో దోచుకున్న 4వేల ఎకరాలను, బిల్డ్‌ఏపీ కింద ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, తద్వారా వచ్చే ఆదాయాన్ని జగన్, విజయసాయిలు తమ 420గ్యాంగుకి దోచిపెడుతున్నారని పట్టాభి ధ్వజమెత్తారు.
ఎగ్జిక్యూటివ్‌కేపిటల్ ముసుగులో, ఇళ్లస్థలాలకోసమంటూ పెద్దఎత్తున భూదోపిడీకి పాల్పడిన జగన్, ఆయన అనుచరులపై విశాఖ రైతులు తిరగబడుతున్నారన్నారు. అమరావతి భూములతోపాటు, విశాఖభూములపై సిట్టింగ్‌న్యాయమూర్తితో విచారణ చేపట్టే దమ్ము, ధైర్యం జగన్‌కు ఉన్నాయా అని పట్టాభి నిలదీశారు. న్యాయవిచారణ జరిపితే, తాముచేసిన కుంభకోణా లు బయటకువస్తాయన్న భయంతోనే జగన్ వెనడుగు వేస్తున్నాడన్నారు. అమరావతి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం సంపూర్ణంగా న్యాయంచేసిందని, 2015 జనవరి1న విడుదలచేసిన జీవోనెం-1ద్వారా అసైన్డ్‌భూములున్న ప్రతి భూయజమానికి న్యాయం చేయడం జరిగిందన్నారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలనుకుంటే, బిల్డ్‌ఏపీ కింద అమ్మాలనుకున్న భూముల్నే పేదవారికి ఎందుకు ఇవ్వడంలేదన్నారు. పేదలనోట్లో మట్టికొడుతూ, అసైన్డ్భూములు ఆక్రమించి, తిరిగివాటికి రిటర్న్‌గా ప్లాట్లు తీసుకుంటూ జగన్‌సర్కారు ఆడుతున్న భూనాటకం బయటపడిందన్నారు. దీనిపై ఎవరు స్పందించినా తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలుగుదేశంనేతలు, కార్యాల యాలపై దాడులుచేసినంత మాత్రాన విజయసాయి, జగన్‌ల భూముల భాగోతం మాసిపోదని, వైసీపీకార్యకర్తలకు ధైర్యముంటే తమనాయకులపైనే తిరగబడాలన్నారు.