కొండపల్లి మునిసిపాలిటీ చైర్మెన్ ఎన్నిక, రెండో రోజు కూడా ఒక హైటెన్షన్ వాతావరణం మధ్య కొనసాగుతుంది. నిన్న జరగాల్సిన ఎన్నిక వైసీపీ చేసిన విధ్వంసంతో, ఈ రోజుకి ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు కొద్ది సేపటి క్రితం, ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయినా, నిన్న ఏ విధంగా అయితే వైసీపీ నాయకులు వ్యవహరించారో, ఈ రోజు కూడా అలాగే వ్యవహరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, వైసీపీ నేతలు అరాచకం చేస్తున్నారు. అయితే లోపల రెండో రోజు కూడా బల్లలు విసిరిగోట్టినట్టు తెలుస్తుంది. ఇక బయట నుంచి కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమికూడి ఉన్నాయి. వారి వాహనాల్లో కర్రలు కూడా ఉన్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. తమ పైన ఎలాగైనా దా-డి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టిడిపి ఆరోపిస్తుంది. మరో పక్క, కొండపల్లి, ఇబ్రహింపట్నంలో,  కొడాలి నాని, నందిగం సురేష్, జోగిరమేశ్ మకాం వేసినట్టు కూడా టిడిపి నేతలు వీడియోలు విడుదల చేసారు.  అయితే ఈ రోజు కూడా ఎన్నిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఈ పిటీషన్ పై కోర్టు మరి కాసేపట్లో విచారణ చేయనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read