కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు చనిపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ కొండగట్టు ఘాట్ రోడ్‌లో తీవ్రమైన రోడ్డుప్రమాదం జరిగిందన్నారు. బస్సు అదుపు తప్పి బోల్తా పడి.. పెద్ద సంఖ్యలో భక్తులు చనిపోవడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, వాళ్ల ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

kondagatu 11902018 2

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 52 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురు చిన్నారులు, 32 మంది మహిళలు ఉన్నారు. మరో 36 మంది క్షతగాత్రలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు కొండగట్టు మీద నుంచి కిందకు వస్తున్న సమయంలో ప్రమాదమైన మూల మలువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు.

kondagatu 11902018 3

ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు లోయలో పడటంతో ఊపిరాడక అధిక సంఖ్యలో మృతి చెందారు. మరో నిమిషంలో ప్రధానరహదారిపైకి చేరుకునే సమయంలో ప్రమాదం జరిగింది. స్పీడ్‌ బ్రేకర్‌ దగ్గర అదుపు తప్పగా, ప్రయాణికులంతా డ్రైవర్‌ వైపు ఒరగడంతో బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు వెలికితీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read