కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక హైటెన్షన్ వాతవరణం మధ్య కొనసాగుతుంది. ఆసక్తికర పరిణామాలు ఉదయం నుంచి చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 14 మంది టిడిపి, 14 మంది వైసీపీ తరుపున గెలవగా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్ధి గెలిచి, టిడిపిలో చేరారు. అయితే ఎక్స్ అఫీషియో మెంబెర్ గా ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ తరుపున ఉండటంతో, వారికి కూడా 15 మంది వచ్చారు. అయితే కోర్టు జోక్యంతో, కేశినేని నాని కూడా ఎక్స్ అఫీషియో మెంబెర్ గా వచ్చారు. దీంతో క్లియర్ మెజారిటీ టిడిపికి వచ్చింది. ఈ రోజు చైర్మెన్ ఎన్నిక ఉండటంతో, గత నాలుగు రోజులుగా కౌన్సిలర్లను క్యాంప్ కు తరలించారు. ఈ రోజు ఎన్నిక ఉండటంతో, బస్సులో కేశినేని నాని దగ్గర ఉండి, వారిని తరలించారు. అయితే ఉదయం నుంచి గందరగోళం నెలకొంది. ముందుగా టిడిపి వారిని లోపలకు వెళ్ళనివ్వకుండా కవ్వించారు. ఎట్టకేలకు లోపలకు వెళ్ళగా, అక్కడ వైసీపీ వారు గోల గోల చేసారు. దీంతో గొ-డ-వ చేయటంతో డిప్యూటీ కలెక్టర్  ఎన్నికను రేపటికి వాయిదా వేసారు. అయినా కేశినేని నాని అక్కడే ఉన్నారు. ఇలా వాయిదా వేయటం, కోర్టు నిబంధనలకు విరుద్ధం అని టిడిపి ఆరోపిస్తుంది. అయితే టిడిపి అక్కడే ఉండి గొడవ చేయటంతో, మళ్ళీ మళ్లీ కౌన్సిల్ హాల్ లోకి వైసిపి కౌన్సిలర్లు వచ్చారు. ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read