గత కొన్ని రోజులుగా ములుపులు తిరుగుతూ వస్తున్న కొండపల్లి మునిసిపల్ చైర్మెన్ ఎన్నిక, ఎట్టకేలకు ఈ రోజు ముగిసింది. కొండపల్లి ఖిల్లా పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్‍గా టీడీపీ అభ్యర్థి చిట్టిబాబు అలాగే వైస్ చైర్మన్లుగా టిడిపి 0వ వార్డు కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి, టిడిపి 29వ వార్డు కౌన్సిలర్ చుట్టకుదురు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వీరికి మద్దతు తెలుపుతూ, 16 మంది టీడీపీ సభ్యులు చేతులు ఎత్తారు. అయితే ఈ ఎన్నిక వ్యవహారం మొత్తం కోర్టులో ఉండటంతో, అధికారులు మాత్రం ఇంకా అధికారికంగా ఎన్నికల ఫలితం ప్రకటించలేదు. ఈ మొత్తం కూడా సీల్డ్ కవర్ లో రేపు హైకోర్టు ముందు ఉంచనున్నారు. ఈ ఫలితాలు పట్ల తెలుగుదేశం శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అనేక అరాచకాలు తట్టుకుని మరీ, ఇక్కడ టిడిపి జెండా ఎగిరినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం, హైకోర్టు ఆదేశాలతో సక్రమంగా జరిగిందని టిడిపి సంతోషం వ్యక్తం చేస్తుంది. హైకోర్టు జోక్యం లేకపోతే, ఈ సారి కూడా ఏదో ఒకటి చేసేవారని అంటున్నారు. అయితే ఈ రోజు పరిణామాలు చూస్తే, హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వటంతో, ఉదయం నుంచి కూడా మొత్తం పోలీస్ పహారాలలో, పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు మధ్య ఎన్నిక జరిగింది.

kondapalli 24112021 2

అటు టిడిపి సభ్యులు, గొల్లపూడి నుంచి, ఇటు వచ్చేంత వరకు కూడా, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా తీసుకుని రావటం జరిగింది. అలాగే వైసీపీ సభ్యులను కూడా ఐతవరం నుంచి ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు. లోపలకు వెళ్ళిన తరువాత, వైసిపీ నేతలు మళ్ళీ గొడవ మొదలు పెట్టారు. ఎన్నిక సీక్రెట్ గా జరగాలని ఆందోళన చేసారు. అయితే రూల్స్ ప్రకారం కేవలం చేతులు ఎత్తి మాత్రమే ఎన్నిక జరగాలని టిడిపి కూడా పట్టుబట్టింది. కేశినేని నాని కూడా, ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ వివరించారు. దీంతో, ఎన్నికల అధికారి కూడా ఒప్పుకున్నారు. మొత్తం ప్రక్రియ మొత్తం కెమెరా రికార్డింగ్ తో జరిగింది. జరిగిన ప్రక్రియ మొత్తం వీడియో గ్రాఫి జరిగింది. ఇది మొత్తం హైకోర్టుకు కూడా ఇవ్వనున్నారు. మొత్తం మీద గత నాలుగు రోజులుగా నడుస్తున్న హైటెన్షన్ వాతవరణం, ఎట్టకేలకు కోర్టు జోక్యంతో, మొత్తం ప్రశాంతంగా జరిగింది. మరి ఇప్పటి నుంచి ఎలాంటి ప్రలోభాలు, ఎలాంటి దౌర్జన్యాలు చేస్తారో చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read