రాజధాని అమరావతికి రక్షణ కవచంగా పనిచేయనున్న కొండవీటివాగు ఎత్తిపోతల పథకం సెప్టెంబర్ 10 లేదా సెప్టెంబర్ 14న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం, నిర్వహణలో విశేష అనుభవం గడించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చేపట్టిన కొండవీటి ఎత్తిపోతల పథకం డ్రై ట్రయల్ రన్ విజయవంతమైంది. శుక్రవారం ఆరుమోటార్లను ఆన్ చేసి వాటి పనితీరును పరీక్షించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎత్తిపోతల పథకా న్ని రూ.222.44 కోట్లతో చేపట్టారు. నిర్మాణ బాధ్యతలను మేఘా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. గత ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పథకానికి శంకుస్థాపన చేశా రు. అప్పటి నుంచి ఎన్నో సవాళ్లను అధిగమించి పథకాన్ని పూర్తి చేసింది.
మేఘా సంస్న ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా పంప హౌస్,డిశ్చార్జి పాయింట్, రెగ్యులేటర్, సబ్ స్టేషన్, ట్రాన్స్మిషన్లైన్ల నిర్మాణాన్ని సంస్థ చేపట్టింది. పంప్ హౌస్ నిర్మాణం పూర్తయింది. 16 మోటార్లు, 16 పంపులు బిగించారు. ఒక్కో మోటార్ నుంచి 350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. 16 పంపుల్లో ఒకటి స్టాండ్ బైగా ఉంటుంది. ఏదైనా మోటార్ మరమ్మతు వచ్చినప్పుడు ఈ మోటార్లు వినియోగిస్తారు. డిశ్చార్జి పాయింట్ నిర్మాణం కూడా పూర్తయింది. కృష్ణానదికి భారీ వరద వచ్చినా 19 అడుగులకు మించ దు. అయితే ఇక్కడ డిశ్చార్జి పాయింట్ ను 22 అడుగుల ఎత్తులో నిర్మించా రు. డిశ్చార్జి పాయిం ట్ నుంచి పంప్ హౌ స్ మధ్య 16 వరు సల పైప్ లైన్ ఏర్పాటు చేశారు.
ఎత్తిపోతల పథకం నిర్వ హణకు ప్రధాన అవసరమైన విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. ఈ ఎత్తిపోతల పథకం నడిచేందుకు 132 బై11కేవీ సామర్థ్యం కలిగిన సబ్ స్టేషన్ ను నిర్మించారు. అమరావతికి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం 29.5 కిలోమీటర్ల మేర కొండవీటి వాగు ద్వారా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర వాగులు, వంకల నీరు కూడా ఇందులోనే చేరుతుంది. లామ్ ఆనకట్ట వద్ద ప్రారంభమైన ఈ కొండవీటి వాగు మేడికొండూరు, తాడికొండ, మంగళగిరి తాడేపల్లి మండలాల్లో ప్రవహిస్తూ ఉండవల్లి అవుట్‌ఫాల్ స్లూయిస్ ద్వారా కృష్ణానదిలోకి చేరుతుంది. అయితే, అమరావతి మునిగిపోతుంది అంటూ, విష ప్రచారం చేసే వాళ్ళకి, ఈ చర్య పాపం మింగుడు పడటం లేదు. అమరావతిలో ఏం జరుగుతుంది అనే వారు, ఈ ప్రారంభోత్సవానికి వస్తే, అన్నీ చూడవచ్చు.. ఇదే మా ఆహ్వానం...