ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి గారు, మద్య నిషేధం అంటుంటే, ఏకంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తాగి, గొడవలు చేసి, చంపేసే స్థాయి దాకా వెళ్లి, ఆ మత్తులో జగన్ మోహన్ రెడ్డిని తిట్టే స్థాయికి వచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దూకుడు గురించి అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే, ఒక విలేఖరిని తిట్టిన ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ప్రెస్ మీట్ లో ప్లే చేసి చూపించారు అంటే, ఎంత భయంకరంగా తిట్టారో అర్ధమవుతుంది. అసెంబ్లీలో కూడా చంద్రబాబుని వేలు చూపిస్తూ, ఖబడ్దార్, ఖబడ్దార్ అంటూ బెదిరించటం కూడా చూసాం. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత మంది గోల చేసినా, పత్రికల్లో, ఛానెల్స్ లో ఇది సరైన పద్దతి కాదని తిట్టినా, ఈయన మాత్రం తగ్గటం లేదు.
ఇలాంటి ప్రవర్తన తప్పు అంటూ, తన పై వార్తలు రాసిన ఒక పత్రికాధినేత ఇంటికి వెళ్లి కొట్టిన సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఇంటిలోకి వచ్చి, తన పై దాడిచేసి కొట్టారని నెల్లూరులో ఉండే జమీన్ రైతు అనే వారపత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. కోటమరెడ్డి, అతని అనుచరులు, ఆయన ఇంటి పై దాడి చేసిన తరువాత, ఆయన మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి, ఎలా వచ్చి దాడి చేసింది మీడియాకు వివరింకాహారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మాగుంట లేవుట్‌లో ఉన్న తన ఇంటికి కోటంరెడ్డి వచ్చారని చెప్పారు. ఆయన ఫుల్ గా మందుతాగి ఉన్నారని, డోలేంద్ర మీడియాకు తెలిపారు. అయన చాలా ఆవేశంతో ఇంట్లోకి వచ్చారని తెలిపారు.
కోటంరెడ్డి వస్తున్న సమయంలోనే, ఆయన సొంత ఊరికి చెందిన డాక్టర్ వసుంధర, నాతో మాట్లాడి ఇంటి బయటకు వస్తుంటే, ఆమెను కూడా చేయి పట్టుకుని ఆవేశంలో మా ఇంట్లోకి తీసుకువచ్చారని డోలేంద్ర చెప్పారు. ఇక ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి బూతులు మొదలు పెట్టారని అన్నారు. నేను నా పత్రికలో, కోటంరెడ్డి చేస్తున్న దౌర్జన్యాలు రాసానని, దాని కోసం, నన్ను చంపటానికి వచ్చారని అన్నారు. ఏరా నేను అరాచక శక్తిని అంటూ, అర పేజి వార్తా రాసావు, ఇప్పుడు నిన్ను ఇక్కడే చంపేస్తున్నా, మూడు పేజీలు వార్తా రాసుకో అంటూ బెదిరించి, కొట్టాడని అన్నారు. అతని అనుచరులు కూడా కొట్టారని అన్నారు. నేను అధికార పార్టీ ఎమ్మేల్యేను, నన్ను ఎవరూ ఏమి పీకలేరు, ఎస్పీకి చెప్పుకుంటావో, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, నేను జగన్ మాట కూడా వినను, జగన్ కూడా నన్ను ఏమి పీకలేడు అంటూ మద్యం మత్తులో జగన్ పైనే తిట్టారని, డోలేంద్ర చెప్పారు. దీని పై పోలీస్ కేసు పెట్టినట్టు చెప్పారు.