నెల్లూరు రూర‌ల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డిని ముఖ్య‌మంత్రి వార్నింగ్ ఇచ్చారా ? అనే కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇటీవ‌ల వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో సీఎం జగన్ నుంచి పిలుపు రావ‌డంతో తాడేప‌ల్లి నివాసంకి వ‌చ్చి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పాత కేసులు బ‌య‌టికి తీస్తామ‌ని బెదిరించి వుంటార‌ని నెల్లూరు టిడిపి నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎంని క‌లిసి వ‌చ్చిన త‌రువాత కోటంరెడ్డి వాయిస్లో తేడా దీనికి నిద‌ర్శ‌నం అంటున్నారు. త‌న‌పై వచ్చిన ఆరోపణలపై సీఎంకి వివరణ ఇచ్చాన‌ని తెలిపారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి జగన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కొందరు అధికారులు సహకరించలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లాన‌న్నారు. ప్రభుత్వంపై వివాదాస్పదంగా తాను మాట్లాడలేదంటూ స‌న్నాయి నొక్కులు నొక్కారు. సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతున్నాన‌ని, దీనిని రాజకీయ కోణంలో చూడకూడద‌న్నారు. అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్లే గ‌డ‌ప గ‌డ‌ప‌కీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేద‌ని వివ‌ర‌ణ ఇవ్వ‌డంపై భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read