వైసీపీ నేత లక్ష్మీ పార్వతి పై లైంగిక ఆరోపణలు చేసిన కోటి, నిన్న బీజేపీ పార్టీలో చేరారు. ఏకంగా ఏపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, కోటిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ పరిణామం పై, బీజేపీ అనధికార మిత్రపక్షం వైసీపీ, బీజేపీ పై అసహనం వ్యక్తం చేసింది. మా పార్టీ నేత పై లైంగిక ఆరోపణలు చేసిన కోటిని, మీ అధ్యక్షుడే పార్టీలో చేర్చుకున్నారు అంటే, మమ్మల్ని అవమానించనట్టె కదా అంటూ ఆక్షేపించారు. అలాగే సోషల్ మీడియాలో కూడా వైసీపీ కార్యకర్తలు, ఈ విషయం పై బీజేపీ పై విమర్శలు గుప్పించారు. కోటికి, మేడలో కాషాయం కండువా కప్పుతున్న కన్నా ఫోటో, సోషల్ మీడియాలో నిన్నటి నుంచి బాగా వైరల్ అయ్యింది. కోటి పై విమర్శలు చేస్తూ, లక్ష్మీపార్వతి కోటీ పై సిబిఐ విచారణ కోరుతున్నారని, అందుకే సిబిఐ విచారణ తప్పించుకోటానికి కోటి బీజేపీలోకి చేరారని, చేసిన తప్పులు బీజేపీలో చేరితే పోతాయా అని ? బీజేపీ పార్టీ పై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. దీంతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది.
ఈ పరిణామాల పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అలెర్ట్ అయ్యింది. కోటిని బీజేపీలో చేర్చుకుంటే వైసీపీ దూరం అవుతుందని భావించిన నేతలు, కోటి చెరక పై వివరణ ఇచ్చుకున్నారు. కోటి బీజేపీలో చేరడం అనుకోకుండా జరిగిపోయిందని, అతని గురించి, స్థానిక పార్టీ నేతలకు సరైన సమాచారం ఇవ్వకుండా అతడు బీజేపీలో చేరారని ఏపీ బీజేపీ వివరణ ఇచ్చింది. అతను ఎవరో కూడా సరిగ్గా తెలియదని, కొంచెం కమ్యునికేషన్ గ్యాప్ ఉండటం వల్ల, కన్నా లక్ష్మీనారాయణ కూడా కండువా వేసారని చెప్పింది. బీజేపీలో కోటికి సభ్యత్వం ఇంకా ఇవ్వలేదని, అతడికీ బీజేపీకి ఎలాంటి సంభందం లేదని, అతడు బీజేపీ సభ్యుడు కాదని ఏపి బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి మీడియాకు ప్రకటన విడుదల చేసింది. మరి ఇప్పటికైనా వైసీపీ నేతలు శాంతిస్తారో లేదో చూడాలి.