కర్నూల్ జిల్లా టిడిపి నేత, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు అంటూ, హడావిడి చేసారు. అయితే, అనూహ్యంగా కోట్ల బయటకు వచ్చి చంద్రబాబుని పొగుడుతూ, జగన్ పాలన పై విమర్శలు సెహ్సారు. ఒక పక్క జగన్ పై విమర్శలు చేస్తూనే, చంద్రబాబు పై విమర్శలు చెయ్యటంతో, ఇక ఆయన పార్టీ మార్పు వార్తలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎప్పటికైనా చంద్రబాబుని పరిపాలనలో కొట్టే వారు ఎవరూ లేరని, ఇప్పుడు జగన్ కూడా అంతే అని, జగన్ పరిపాలన కంటే చంద్రబాబు పరిపాలన వంద శాతం బెటర్ అని కోట్ల అన్నారు. వైఎస్ జగన్ ని ప్రజలు దగ్గరకు తీసారు అంటే, అది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగానే అని, అందుకే ప్రజలు ఒక అవకాసం ఇచ్చారని కోట్ల అన్నారు.
అయితే, ప్రస్తుతం జగన్ పరిపాలన అనుకున్నట్టు ఏమి లేదని, ఎదో సాగుంతుందని, ప్రజలకు అప్పుడే తేడా తెలిసిపోయిందని అన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై జరుగుతున్న దాడుల విషయంలో కూడా తీవ్రంగా స్పందించారు. తమ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ కూర్చోమని, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని అన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే. తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చేసారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెష్ పార్టీలో కొనసాగారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇక కోలుకునే పరిస్థితి లేకపోవటంతో, ఆయన మొన్న ఎన్నికలో తెలుగుదేశం పార్టీలో చేరారు.a