దేశంలోనే తొలిసారిగా వంటింట్లోకి నేరుగా గ్యాస్‌ సరఫరా చేసే ప్రాజెక్టుకు ‘మేఘా ఇంజనీరింగ్‌’ శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా, కర్ణాటకలోని తుంకూరు, బెల్గాం జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. వినియోగదారులకు నేరుగా వంటింటికే గ్యాస్‌ను అందించేలా ‘ఎకో ఫ్రెండ్లీ’ విధానాలను అమలు చేయనున్నది. నిజానికి, ‘మేఘా’ ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. త్వరలో అధికారికంగా ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, కానూరులో ఫిల్లింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

gas 09062018 2

కర్ణాటకలో తూంకూరు, బెల్గాం జిల్లాలోనూ గృహ, వాణిజ్య గ్యాస్‌ సరఫరాకు ‘మేఘా’ సన్నద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్‌ సరఫరా కోసం ఓఎన్‌జీసీ , గెయిల్‌లతో ‘మేఘా’ ఒప్పందం చేసుకుంది. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఇటీవలే వాణిజ్యపరమైన గ్యాస్‌ సర్వీసులను ఓఎన్‌జీసీ ప్రారంభించింది. ఈ కేంద్రం నుంచి 90 వేల స్టాండర్ట్‌ క్యూబిక్‌ మీటర్‌ పెర్‌ డే (ఎన్‌సీఎండీ) పొందేలా ఓఎన్‌జీసీతో మేఘా అవగాహన కుదుర్చుకుంది. ఆ సంస్థ నుంచి అందుకొనే గ్యాస్‌ను ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రధాన కేంద్రం నుంచి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం 571 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ వేశారు. ఇప్పటికే కొన్ని ఇళ్లకు గ్యాస్‌ కనెక్షన్లను ‘మేఘా’ ఇచ్చింది. వినియోగదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది.

gas 09062018 3

మేఘా ఇంజినీరింగ్‌ మెయిల్‌- హైడ్రోకార్బన్స్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు పనితీరును పరీక్షించామని, త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, కానూరుల్లో ఫిల్లింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశామని, దీనికి అవసరమైన భూగర్భ సరఫరా వ్యవస్థ సిద్ధమైందని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ, వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్‌ సరఫరా చేయడం ద్వారా జీవన ప్రమాణాలను, సమాజంలో ఇన్‌ఫ్రా ఫలాలను నేరుగా అందించేందుకు పర్యావరణ హిత పద్ధతులను అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓఎన్‌జీసీ ప్రారంభించిన గ్యాస్‌ కేంద్రం నుంచి 90వేల ఎస్‌సీఎండీ (స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌ పర్‌డే) గ్యాస్‌ను ఒక రోజులో పొందేలా త్వరలో ఓఎన్‌జీసీతో ఒప్పందం కుదుర్చుకోనున్నామని వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read