కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టుల పై, తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉండటం, తద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్యాయం జరుగుతూ ఉండటంతో, తక్షణమే తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని, తెలంగాణా ప్రభుత్వానికి దీని పై వెంటనే ఆదేశాలు ఇవ్వాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ రైతులు నిన్న తెలంగాణా హైకోర్టులో అత్యవసరంగా వాదించాలి అంటూ, హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. అయితే ఈ పిటీషన్ సాంకేతిక కారణాలతో, తిరస్కరణకు గురయ్యింది. హౌస్ మోషన్ పిటీషన్ గా దాఖలు చేయాలని రైతులు పిటీషన్ మూవ్ చేయగా, సాంకేతిక కారణాలు ఉండటంతో, ఆ పిటీషన్ తిరస్కరించి, అందులో తిరస్కరణకు గురైన అంశాలు చూపించారు. దీంతో ఈ రోజు పిటీషన్ ను సవరించి, మళ్ళీ దాఖలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 34, ఏపి పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని చెప్పి, రైతులు పేర్కొన్నారు. ముఖ్యంగా సాగు నీటి కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కృష్ణా డెల్టాతో పాటుగా, నాగార్జున సాగర్ ఆయుకట్టు కింద ఉన్న రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారని, ఈ నేపధ్యంలో శ్రీశైలం , నాగార్జన సాగర్, పులిచింతల ప్రాజెక్ట్ లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు.
ఉన్న నీతితో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, నీటిని కిందకు వదలటం అనేది, చట్ట విరుద్ధం అనేది చెప్తున్నారు. నీటి విడుదలను కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు, పర్యవేక్షిస్తున్నా, ఆ బోర్డు అనుమతి లేకుండా, నీటిని జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించటం అనేది న్యాయ, చట్ట విరుద్ధం అని వారు పేర్కొన్నారు. తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయాలనీ ఏకపక్షంగా జీవో జారీ చేసిందని, వెంటనే విద్యుతు ఉత్పత్తి నిలిపివేయాలని, ఏపి ప్రభుత్వం చేసిన ఫిర్యాదు పై, తెలంగాణా ప్రభువాన్ని కృష్ణ రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు ఆదేశించినా కూడా, తెలంగాణా ప్రభుత్వం మాట వినటం లేదని, రైతులు ఆ పిటీషన్ లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ఆపమని ఫిర్యాదు చేసిందని, అయినా ఈ రోజుకీ కూడా విద్యుతు ఉత్పత్తి నిలిపివేయలేదని, ఈ నేపధ్యంలో వెంటనే దీని పై తగు చర్యలు తీసుకుని, కృష్ణా డెల్టా రైతులను, నాగార్జున సాగర్ ఆయుకట్టు కింద ఉన్న రైతులను కాపాడాలని, వారు ఆ పిటీషన్ లో తెలిపారు. అయితే ఈ పిటీషన్ సవరించి, ఈ రోజు లంచ్ మోషన్ పిటీషన్ గా మూవ్ చేసే అవకాసం ఉంది.