ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంటూ జగన్ ప్రకటన చెయ్యటం, తరువాత దాని పై రాష్ట్రమంతా పెద్ద రగడ అవ్వటం, గత 30 రోజులుగా రైతులు ఆందోళన చెయ్యటం, మహిళల పై కూడా కర్కశంగా ప్రవర్తించటం, ఇలా ఏపి రాష్ట్రం, ఈ రాజధాని విషయంలో, అల్లకల్లోలంగా ఉంది. అయితే ఇదే విషయం పై తెలంగాణా మంత్రి, కేసీఆర్ కొడుకు, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి, తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, తెలంగాణాలో ఉన్న 10 జిల్లాలను, 33 జిల్లాలుగా మేము విభజన చేసామని అన్నారు. ఇది సాహసోపేత నిర్ణయం అని, కొత్త జిల్లాల ఏర్పాటు చేసే సమయంలో కాని, తరువాత కాని, తెలంగాణా రాష్ట్రంలో రవ్వంత కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదని, కేటీఆర్ అన్నారు. అయితే ఇదే సందర్బంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం, ఒక రాజధాని నుంచి, మూడు రాజధానులు చేసే క్రమంలో, తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ఇలా ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుందో, అక్కడ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

ktr 17012020 3

తెలంగాణాలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల సందర్భంగా, కేటీఆర్ శుక్రవారం నాడు, మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంలోనే రాష్ట్రంలో పరిస్థితులు, ప్రతిపక్షాల ఆరోపణల పై స్పందిస్తూనే, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న గొడవ పై స్పందిన్కాహారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసిన తరువాత, 29 గ్రామాల రైతులకు మద్దతుగా రాష్ట్రమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణాలో ఇలా జరగలేదని, 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడ్డాయని, ఎక్కడా చిన్న ప్రజా వ్యతిరేకత లేకుండా చేసామని, కేసీఆర్ సక్సెస్‌ఫుల్‌గా పరిపాలన సాగిస్తున్నారని కేటీఆర్ అన్నారు. అయితే ఇదే సందర్భంలో అక్కడ ప్రజా ఉద్యమం ఎందుకు వచ్చిందో ఆలోచించాలి అని కేటీఆర్ అన్నారు.

ktr 17012020 2

అంటే, ఈ విషయం డీల్ చేసే విషయంలో, జగన్ విఫలమయ్యారనే రీతిలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో కేసీఆర్ అందరినీ ఒప్పించి సక్సెస్ అయ్యారని, కాని ఏపిలో ప్రజా వ్యతిరేకత వచ్చింది అంటే, ఇది ప్రభుత్వం వైఫల్యం అనే రీతిలో కేటీఆర్ వ్యాఖ్యలు చేసారు. మరో పక్క, జనసేన, బీజేపీ కలిసి, ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకున్న విషయం పై, కూడా కేటీఆర్ స్పందించారు. వారి పొత్తు పై ఇప్పుడే ఏమి స్పందించలేమని అన్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు పొత్తు పెట్టుకుంటే, తాను ఏమి చేస్తానని, ఆ విషయాన్ని ఏపీ ప్రజలు చూసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనసేన అంతర్జాతీయ పార్టీ కూడా కావొచ్చేమో అని వ్యాఖ్యానించారు. అయినా పక్క రాష్ట్రంలో పవన్ ఏమి చేస్తే మనకు ఎందుకు అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read