నేను వీరుడుని, సూరుడుని.. నా వల్లే చంద్రబాబు గెలిచాడు.. నా వల్లే నరేంద్ర మోడీ గెలిచాడు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా సేన సిద్దం అని చెప్పే పవన్ కళ్యాణ్, తెలంగాణా ఎన్నికల్లో తోక ముడిచాడు. ముందస్తు ఎన్నికలు వస్తాయి అని అనుకోలేదు, అందుకే మేము పోటీకి దూరం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతాం అని చెప్పారు. అయితే, రెండు రోజుల క్రిందట, పవన్ కళ్యాణ్ ర్ధాంతరంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ముంబై వెళ్లారు. పవన్ ముంబై పర్యటన పై ముంబై మిర్రర్ అసిస్టెంట్ ఎడిటర్ ఒక ట్వీట్ చేసారు. పవన్ ముంబై పర్యటన తరువాత మనసు మార్చుకున్నారు, తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటూ, ట్వీట్ చేసారు. అయితే, పవన్ ముంబై పర్యటనకు, ఈ నిర్ణయానికి సంబంధం ఏంటో అర్ధం కాలేదు.

pk 20112018 2

తరువాత తెలిసింది ఏంటి అంటే, అవార్డుల కార్యక్రమంలో పాల్గునటానికి కేటీఆర్ కూడా ముంబై వెళ్లారు. వీరిద్దరి మధ్యా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ప్రాధమిక సమాచారం ప్రకారం, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో, పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధులని నిలబెడతారాని, ఆంధ్రా ఓట్లు చీలిక కోసం, ఈ ప్రయత్నం చేస్తున్నారని లీక్ ఇచ్చారు. అయితే, ఇక పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణాలో పోటీ చేస్తారని, హైదరాబాద్ లో, ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉన్న చోట్ల పోటీ చేస్తారని, అందరూ అనుకున్న టైంల, నామినేషన్ చివరి గంటలో, మేము పోటీ చెయ్యటం లేదు అంటూ, పవన్ కళ్యాణ్ నుంచి ప్రెస్ నోట్ వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది అనే దాని పై, ఆరా తియ్యగా, తెరాస వర్గాలు అసలు విషయం చెప్పాయి.

pk 20112018 3

కేటీఆర్, పవన్ కళ్యాణ్ ముంబైలో జరిగిన డీల్ తరువాత, ఇదే విషయం వచ్చి కేసీఆర్ కు చెప్పటంతో, కేసీఆర్ ఈ విషయంలో విముఖంగా ఉన్నారని చెప్తున్నారు. దానికి కారణాలు కూడా చెప్తూ, పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎలాగూ మనకే ఓట్లు వేస్తారు కదా, వాళ్ళు ప్రజా కూటమికి ఓట్లు వెయ్యరు కదా, మళ్ళీ ఇప్పుడు పవన్ పోటీ చేసి, ఉపయోగం ఏంటి ? ఖర్చులు బొక్క తప్ప, అని కేసీఆర్ అన్నట్టు సమాచారం. ఎలాగూ పవన్ ఫాన్స్ అందరూ మనకు వేస్తారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, మన ఓట్లే కదా చీలేది, ఇలాంటి పిచ్చి పనులు చెయ్యద్దు, మీ ప్రయత్నాలు మానుకోండి అంటి కేటీఆర్ కి చెప్పినట్టు తెలుస్తుంది. పవన్ పోటీ చేస్తే, మన ఓట్లే చీలిపోతాయని కేసీఆర్ చెప్పటంతో, కేటీఆర్ ఆ నిర్ణయం పవన్ కు చెప్పి, పవన్ ను పోటీ నుంచి విరమించినట్టు తెలుస్తుంది. అందుకే నామినేషన్ల చివరి నిమిషం దాకా, జనసేన ఏ నిర్ణయం ప్రకటించలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read