చంద్రబాబు ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా ముందుకు వెళ్తుంటే, చంద్రబాబుని దించి, రాష్ట్రాన్ని జగన్ చేతిలో పెట్టి, హైదరాబాద్ నుంచి కంట్రోల్ చెయ్యటానికి, కేసీఆర్, మోడీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తున్నాం. తాజగా, మరోసారి జగన్ పై తనకున్న ప్రేమ, ఏపి పై ఉన్న ద్వేషం చాటుకునంరు కేటీఆర్... ఇప్పటికే జగన్ గెలుపు కోసం, అన్ని విధాలుగా సహాయం చేస్తున్న టీఆర్ఎస్, ఇప్పుడు మరో సారి జగన్ మీద ఉన్న ప్రేమ చూపించింది. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్... తన చేతకానితనం వల్లే చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోబోతున్నారని వ్యాఖ్యానించారు. తాము టీడీపీ నేతలను వైసీపీలోకి పంపుతున్నామన్న టీడీపీ వాదన విడ్దూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల తరువాత చంద్రబాబు కనీసం విజయవాడలో కూడా చక్రం తిప్పలేడని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ ఏపి రాజకీయాల్లో వేలు పెట్టటం ఏమో కాని, ఇక్కడ కొంత మంది మాత్రం, వీర లెవెల్లో రెచ్చిపోతున్నారు. అప్పట్లో స్వతంత్ర పోరాటం చేసే క్రమంలో, ఇక్కడ కొంత మని మన దేశంలో విష పురుగులు, బ్రిటీష్ వారితో కలిసి, సొంత మాతృభూమికే అన్యాయం చేసారు. ఇలాంటి విష పురుగులు, ఇప్పుడు ఏపిలో కూడా తయారయ్యాయి. ఏపి ప్రజలను ఛీ కొట్టి, కుక్కలు, రాక్షులు అని, చివరకు మనం తినేది పెంట అని సంభోదించినా, ఇక్కడ కొంత మందికి మాత్రం, కేసీఆర్ అంటే ప్రేమ కారిపోతుంది. మన కష్టంతో నిర్మించుకున్న హైదరాబాద్ నుంచి మనలను గెంటేసి, కనీసం రాజధాని కూడా లేకుండా, ప్రయాణం ప్రారంభించిన మన ధుస్తుతికి కారణం అయిన కేసిఆర్ ను నెత్తిన పెట్టుకుంటున్నారు.
ఇన్ని ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నా, మనకు 5 వేల కోట్లు విద్యుత్ బకాయులు ఇవ్వని కేసీఆర్ అన్నా, దాదాపు 50 వేల కోట్ల ఉమ్మడి ఆస్థుల విభజన చేసి మన రాష్ట్రానికి ఇవ్వని కేసీఆర్ అన్నా, పోలవరం ఆపే కేసీఆర్ అన్నా, ఏపికి ప్రత్యేక హోదా వద్దు అంటున్న కేసీఆర్ అన్నా, ఏపిలో కొంత మందికి, ఇక్కడ ప్రతిపక్ష నాయకులకి, కేసీఆర్ అంటే ప్రేమ కారిపోతుంది. ఇక్కడ కేసీఆర్ చెప్పే మాట పెద్ద విశేషం కాదు. ఆయన మొదటి నుంచి ఆంధ్రా ద్వేషి. కాని ఈ ఆంధ్రా ద్వేషిని జగన్ ఎలా పొగుడుతారు ? చంద్రబాబు మీద ద్వేషం ఒక్కటే కారణమా ? ఏపి ప్రజలు గురించి వీరి ఆలోచించరా ? కేవలం చంద్రబాబు మీద కోపంతో, ఏపి ప్రజల ఆత్మగౌరవాన్ని, సిగ్గు లేకుండా, ఈ బ్యాచ్ అంతా కలిసి కేసీఆర్ కాళ్ళ కింద పెడుతున్నారు.