ఉట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగిరింది అనే పాత సామెత గుర్తు ఉందా?తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ని చుస్తే ఈ సామెత గుర్తువస్తుంది.ఊరికే ఆరోపణ కాదు ఈ మధ్య ఎటువంటి అవగాహనా లేకుండా కేటీఆర్ మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తు చేసుకుందాం.డేటా చోరీ కేసు...ఆంధ్రా డేటా పోయింది అని ఒక A2 తెలంగాణ లో కేసు పెట్టాడు దానితో పాటు పోలీసులు ఏం మాట్లాడాలో స్కెచ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయారు.ఆ సందర్భాల్లో ఘనత వహించిన ఐటీ మంత్రి కేటీఆర్ గారు నోరుపారేసుకున్నారు...దొంగలు దొరికారు అబ్బా కొడుకుని జైలుకి పంపుతాం అని మాట్లాడాడు.అసలు నీ స్థాయి ఏంటి ?నువ్వు మంత్రి గా ఎం సాధించావు?నీ శాఖల్లో సాదించిన ఘనత ఏంటి?చంద్రబాబు సౌమ్యుడు నీ బాబు లా నీచుడు కాదు కాబట్టి నీకు అంత దైర్యం వచ్చింది.చంద్రబాబు తలచుకుంటే నీ లెక్కలు కాదు మీ తాతల లెక్కలు కూడా తేలుస్తాడు...కానీ ఇక్కడే మీ అమాయకత్వం బయటపడుతుంది.చంద్రబాబు ఎప్పుడూ సంక్షోభాలను ఆహ్వానించే వ్యక్తి... సంక్షోభాలను ఎదుర్కొని నిలబడే వ్యక్తి కాబట్టే చంద్రబాబు కి ప్రకృతి సహకరించింది మీ కుట్ర బయటపడింది.అసలు ఏంటి ఈ డటా కేసు ? పోయింది ఎపి డేటా అన్నావు ?తరువాత కాదు కాదు ఆధార్ డేటా అన్నావు వాళ్లు మా డేటా పోలేదు అనే సరికి ఎలెక్షన్ కమిషన్ డేటా అన్నావు వాళ్లు మా డేటా పోలేదు అనే సరికి ఇప్పుడు ఇతర రాష్ట్రాల డేటా అంటున్నావ్...ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా మా డేటా పోలేదు అని చెబితే నీ పరిస్థితి ఏంటి ?
మాకు తెలుసు నువ్వు ఏమంటావో అమెరికా డేటా టిడిపి దగ్గర ఉంది... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ... హైదరాబాద్ వచ్చినప్పుడు నేను పాదాలు మొక్కిన ఇవాంకా ట్రంప్ డేటా ఉంది అని చెప్పడానికి కూడా నువ్వు వెనకాడవు.నువ్వే ఓవర్ అనుకుంటే నీ ఆదేశాలతో నీ పోలీసులు మరీ ఓవర్ యాక్షన్ చేసారు కొండను తవ్వాము ఎలుకను పట్టాం అంటూ తెలంగాణ పోలీసులు మాట్లాడిన మాటలు ,ప్రెస్ మీట్లు అన్ని గుర్తు ఉన్నాయి...మేము మీరు చేసిన ఏ పనిని తప్పు పట్టం నీకు ఫిర్యాదు వచ్చింది నువ్వు దర్యాప్తు చేసావ్...ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం మా డేటా పోయింది ?మా పిల్లల భవిష్యత్తు ఏంటి ?23 మంది విద్యార్థులు చనిపోయారు?మా పరీక్ష పేపర్లు పోయాయి అని అడుగుతున్నారు మరి నీ వీరోచిత పోలీసులు,ప్రభుత్వం ఎందుకు విచారణ కి వెనుకాడుతున్నారు ?పక్క రాష్ట్రాల డేటా పై ఉన్న ప్రేమ నీ రాష్ట్రం డేటా పై ఎందుకు లేదు ?మీ ఇంట్లో బాగా చదివే పిల్లలు ఫెయిల్ అని ఫలితాలు ఇస్తే నువ్వు ఇలానే స్పందిస్తావా ?ఉదాహరణకి ఈ ఘటన ఏపీలోనే జరిగితే నువ్వు ఎలా స్పందిస్తావ్ ?చంద్రబాబు రాజీనామా చెయ్యాలి... ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యాలి... జగన్ ని ముఖ్యమంత్రి చెయ్యాలి అని స్టేట్ మెంట్లు ఇస్తావ్. మీడియా కూడా కనీస అవగాహన లేకుండా నీ మాటలను బ్రేకింగ్స్ ఇస్తుంది. డేటా చోరీ కేసు లో మీడియా వ్యవహరించిన తీరు అదే కదా ... డేటా అంటే తెలియని వాళ్లు ఒక A2,ఒక A1 ఛానల్ ఇచ్చిన వార్తలు,వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని మేము ఎదో పరిశోధన చేసినట్టు వార్తలు ఇచ్చారు.
మిమ్మల్ని మేము తప్పుబట్టడం లేదు మీరు ఇచ్చిన వార్తలే నిజం అనుకుందాం... మరి ఇప్పుడు మీ గొంతులు ఎందుకు మూగ బోయాయి ? 10 లక్షల మంది విద్యార్థుల డేటా పోయింది అని ప్రజలు రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తుంటే మీకు వినపడటం లేదా ? వాళ్లు తెలంగాణ వాళ్లు కాదా ? వీరోచితంగా చంద్రబాబు ని ప్రశ్నించే మీడియా గొంతులు కేసీఆర్ ,గ్లోబరినా కంపెనీ వెనుక ఉన్న కేటీఆర్ పేరు ఎత్తే దైర్యం మీడియాకి ఎందుకు రావడం లేదు...కేటీఆర్ ఇతర రాష్ట్రాల డేటా వెతికే ముందు నువ్వు డేటా అంటే ఏంటో తెలుసు కో,ఇంటర్ ఫలితాలు ,టెన్త్ ఫలితాలు ఎలా ఇవ్వాలో నేర్చుకో పెద్ద పెద్ద విషయాలు మనకు ఎందుకు బుజ్జి ఐటీ మంత్రి ని అని ఫోజులు డాబు మాటలు కాదు ముందు నువ్వు కనీస అవగాహన పెంచుకో.మీడియా కూడా ఇంకో ఐదేళ్లు వాళ్లకి డప్పు కొట్టడం మానదు అందుకే ప్రకృతి సమాధానం చెప్పడం మొదలు పెట్టింది...మీడియా ప్రశ్నించక పోతే ఏంటి మేమే ప్రశ్నిస్తాం అని తెలంగాణ సమాజం రోడ్డు ఎక్కింది... నువ్వు మీడియా ని మ్యానేజ్ చెయ్యగలవేమో కానీ ప్రకృతి ని కాదు ,ప్రజలని కాదు...విషయం అర్ధం అయ్యింది కదా ఇప్పుడు నువ్వు నీ పోలీసులు ముందు ఇంటర్ డేటా వెతకండి,గ్లోబరినా సంస్థ లో డేటా ఎక్కడికి పోయిందో వెతకండి. ఆ తరువాత తిరిగ్గా ఏపీ డేటా వెతుకుదువుగాని..