కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌జూపుడి ప్రభాకర్‌రావు ఇంట్లో ఆకస్మిక తనిఖీల పేరుతో రచ్చ రచ్చ చేసారు. స్థానిక తెరాస కార్యకర్తలకి తోడుగా, కడప నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తలు, ఆంధ్రా నాయకులు ఇల్లు టార్గెట్ చేసుకుని, స్థానిక పోలీసుల బలంతో, దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో, జూపూడి ఇంటి పై దాడి చేసి, డబ్బు దొరికినట్టు ప్రచారం చేసారు. పోలీసులు ఏమి చెప్పకపోయినా, వీళ్ళ చానల్స్ లో మాత్రం, చంద్రబాబు డబ్బు అంటూ హడావిడి చేసారు. ఈ దాడులు పై జూపూడి ప్రభాకర్ ఈసీకి ఫిర్యాదు చేసారు. తెరాస కార్యకర్తల ముసుగు లో వైసిపి కార్యకర్తలు తెలుగుదేశం నాయకుల పై కూకట్పల్లి నియోజకవర్గం లో దాడులు చేస్తున్నారు నిన్న జూపూడి గారి నివాసంపై జరిగిన దాడిలో స్థానిక తెరాస కార్యకర్తల కంటే కడపకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు.
"నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఎన్నికల ప్రక్రియ నిమిత్తం నేను మా పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం అయి ఉండగా మా ఇంటిని సోదా చేయడానికి పోలీసులు వచ్చి ఇల్లంతా సోదా చేస్తున్నారని, దురుసుగా ప్రవర్తిస్తున్నారని కంగారుగా మా సతీమణి నుండి ఫోన్ రాగా వెంటనే మా ఇంటికి వచ్చాను. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా మా ఇంటి లోనికి దౌర్జన్యంగా చొరబడి ఆడవారు అని కూడా చూడకుండా ఇంటిలో నానా బీభత్సం చేసి ఇల్లంతా సోదా చేశారు. చాలా దురుసుగా ప్రవర్తించి నా వ్యక్తిగత మరియు కుటుంబ గౌరవానికి భంగకరంగా అవమానకర రీతిలో ప్రవర్తించారు. ఒకసారి పోలీసులు మరోసారి ఎన్నికల సంఘం వారు విడతలవారీగా సోదా చేసి ఏమి దొరకలేదని నిర్ధారణ చేశారు. నేను వచ్చేసరికి డి.సి.పి, ఏ.సి.పి మరియు పోలీసులు పైకి వచ్చి ఎటువంటి ఆర్డర్ చూపించకుండా గృహ నిర్బంధం చేస్తున్నాం అని చెప్పారు. ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఇంట్లోనే ఉండాలి అని బెదిరించి నన్ను బలవంతంగా ఒక రూమ్ లో పెట్టి తాళం వేసి నిర్బంధించారు. సోదాల అనంతరం డి.సి.పి మరియు ఏ.సి.పి వారు ఏమీ లేదని నిర్ధారించుకుని అప్పుడు నా రూము తాళం తీసి వెళ్లారు. జరిగిన సంఘటన పై పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి నేను కిందకు రాగా కింద స్థానిక టిఆర్ఎస్ నాయకుడు గోనే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ కార్యకర్తలు, పోలీస్ వారు అందరూ కలిసి నన్ను బయటకు రానీయకుండా అడ్డుకున్నారు.
గోనె శ్రీనివాసరావు గొనె శ్రీనివాసరావు,కరుణాకర్ రెడ్డి,ఆరోగ్య రెడ్డి,కోటి రెడ్డి,మరియు అతని బావ మరిది, మరియు రవీంద్ర రెడ్డి ,వెంకటేష్ లు కులం పేరుతో దూషిస్తూ అసభ్యకరమైన పదజాలంతో నినాదాలు చేస్తూ నాపై, మా కార్యకర్తలపై దాడి చేశారు. అయినా పోలీస్ వారు మాకు రక్షణ రాకుండా వారిని సమర్థిస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరించారు. మా ఇంటిలో ఎటువంటి డబ్బులు లభించనప్పటికీ కేవలం రాజకీయ దురుద్దేశంతో సోదాల పేరుతో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇంతలో టిఆర్ఎస్ కార్యకర్త గోనె శ్రీనివాసరావు బయట నుంచి డబ్బులు తీసుకువచ్చి ఇంట్లోనే దొరికినవని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియాతో మాట్లాడారు. అప్పటికే మూడు దఫాలుగా అధికారుల సమక్షంలో జరిగిన సోదాలలో ఇంటిలో ఏమీ దొరకలేదని పోలీసులు మరియు ఎన్నికల సంఘం వారు నిర్ధారించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో బయటనుండి డబ్బులతో వచ్చి టిఆర్ఎస్ నాయకులు గోనే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాపై నిందారోపణలు చేశారు. ఈ విషయంలో పోలీసులు కానీ ఎన్నికల అధికారులు గాని ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా మౌనంగా ఉండటం ఆక్షేపణీయం.
అత్యంత హాస్యాస్పదంగా అధికారులకు దొరకని డబ్బు టీఆర్ఎస్ నాయకులకు దొరికినట్టుగా అది కూడా ఎక్కడో బయట దొరికినట్టుగా టిఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడటం, వారే ఆ డబ్బులు తీసుకొని పోలీస్ పోలీస్ స్టేషన్ వెళ్లి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి స్థానంలో కూర్చుని వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయటం జరిగింది. గొనె శ్రీనివాసరావు,కరుణాకర్ రెడ్డి,ఆరోగ్య రెడ్డి,కోటి రెడ్డి,మరియు అతని బావ మరిది, మరియు రవీంద్ర రెడ్డి ,వెంకటేష్ లు నన్ను కులం పేరుతో దూషించడం, నా ఇల్లు పడగొడతానని, ఆంధ్ర వాడికి ఇక్కడేం పనని మర్యాదపూర్వకంగా మాట్లాడి నన్ను మరియు మా కుటుంబ సభ్యులను తీవ్ర మనస్తాపానికి గురిచేశారు. నా గౌరవమర్యాదలకు భంగకరంగా టిఆర్ఎస్ నాయకులు, వారికి సహకరించిన పోలీసులు ప్రవర్తించారు. ఏసీపి మరియు డిసిపి వారు వారికి వ్యక్తిగతంగా అధికార పార్టీ ముఖ్య నాయకులతో ఉన్న బంధుత్వం దృష్ట్యా నాపై కక్షపూరితంగా ప్రవర్తించారు. వీరి నుండి నాకు ప్రాణ హాని కూడా ఉన్నదని సవినయంగా మనవి చేస్తున్నాను. కావున తమరు ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపి సంబంధిత డిసిపి, ఏసిపి మరియు టిఆరెస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకొని నాకు తగు న్యాయం చేసి రక్షణ కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను."