కర్నాటక సియం కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతున్న ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ‘‘అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా’’ రావచ్చుననీ.. జేడీఎస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఆయన చెబుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. మాండ్యకు చెందిన ఓ జేడీఎస్ కార్యకర్త తొలుత సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేసుకున్నట్టు చెబుతున్నారు. ‘‘మనం ఇప్పుడే మొదలు పెట్టాలి. తర్వాత చేద్దామంటే కుదరదు. వచ్చే నెల నుంచే మనం సిద్ధంకావాలి. ఎన్నికలు ఎప్పుడొస్తాయో మనకు తెలియదు. వచ్చే ఏడాది, వచ్చే రెండేళ్లు లేదా మరో మూడేళ్లలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి...’’ అని నిఖిల్ పేర్కొన్నారు. కర్నాటక సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చునని భావిస్తున్న నేపథ్యంలో కుమారస్వామి తనయుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

kumarswamy 07062019 2

అయితే ఈ వీడియోలో నిజమెంత అన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. కర్నాటక జేడీఎస్ చీఫ్ ఏహెచ్ విశ్వనాథ్ తన పదవికి రాజీనామా చేసిన కొద్దిరోజులకే ఈ వీడియో బయటికి రావడం గమనార్హం. కాగా ప్రస్తుతం జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ప్రమాదమేమీ లేదనీ.. తన తండ్రి పూర్తికాలం పాటు సీఎం పదవిలో ఉంటారని నిఖిల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నుంచి పోటీచేసిన నిఖిల్... బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సుమలత అంబరీష్‌పై ఓడిపోయిన సంగతి తెలిసిందే. కర్నాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 25 కైవసం చేసుకోగా... కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కేవలం చెరో స్థానాన్ని మాత్రమే దక్కించుకున్నాయి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read