మూడు రోజుల నుంచి, తన కుమార్తె పెళ్లి సందడిలో సరదాగా గడిపిన మంత్రి పరిటాల సునీత, అనుకోని సంఘటనతో కుప్పకూలిపోయారు. దివంగతన నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ సాబ్ హఠాన్మరణం చెందడంతో మంత్రి పరిటాల సునీత ఆసుపత్రిలోనే కళ్లుతిరిగి స్పృహతప్పి పడిపోయారు. పరిటాల రవి కుమార్తె స్నేహలత వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న చమన్‌కు సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే అనంతపురంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు. కుమారుడు శ్రీరామ్‌తో కలిసి ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సునీత చమన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

suneeta 07052018 2

అయితే వైద్యులు చికిత్స అందిస్తుండగానే చమన్ ఆకస్మికంగా మృతి చెందారు. చమన్ మృతి చెందారనే విషయం తెలియగానే అక్కడే ఉన్న సునీత ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడు శ్రీరామ్ ఓదారుస్తుండగానే సునీత స్పృహతప్పి పడిపోయారు. వెంటనే శ్రీరామ్‌తో పాటు అక్కడున్నవాళ్లు పైకి లేపి ఆసుపత్రి బెడ్‌పై పడుకోబెట్టారు. అనంతరం వైద్యులు ఆమె ఆరోగ్యపరిస్థితిని పరిశీలించి, చికిత్స అందిస్తున్నారు. పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల స్నేహలత వివాహ వేడుక కోసం పర్యవేక్షణ కోసం మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్‌కు సోమవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మంత్రి పరిటాల సునీత వెంటనే చమన్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చమన్ మృతి చెందారు.

suneeta 07052018 3

పరిటాల రవికి ఎంతో సన్నిహితుడైన చమన్‌ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో చమన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. 2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం... పరిటాల సునీత మంత్రి అవడంతో.. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున చమన్ జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తరువాత తన పదవికీ రాజీనామా చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read