రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలను రణరంగాన్ని సృష్టించే విధంగా మార్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరీ ముఖ్యంగా కుప్పంలో అరాచకాలు తారా స్థాయికి వెళ్ళాయి. నామినేషన్లు లాక్కుని పారిపోవటం, అభ్యర్ధులను కిడ్నాప్ చేయటం, కొట్టటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, విధ్వంసం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కుప్పంలో అరాచకాలను దీటుగా ఎదుర్కోవటానికి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని టిడిపి రంగంలోకి దించింది. ఆయన ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతూ, అక్కడ ధీటుగా బదులు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు అమర్నాథ్ రెడ్డిని టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన పై తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. కుప్పం 14వ వార్డు అభ్యర్థి ప్రకాష్ ని అమర్నాథ్ రెడ్డి కిడ్నాప్ చేసారు అంటూ, తమ అనుకూల మీడియాలో ప్రచారం చేసారు. అంతే కాదు, వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూడా అమర్నాథ్ రెడ్డి పై ఫిర్యాదు చేసారు. అంతే కాదు, చంద్రబాబు కార్యదర్శి మనోహర్, పీఎస్.మునిరత్నం, వెంకటేష్ పైనా ఫిర్యాదు చేపించారు. బంధువులతో ఫిర్యాదు చేపించారు. అసలు టిడిపి అభ్యర్ధిని అమర్నాథ్ రెడ్డి ఎందుకు కిడ్నాప్ చేస్తారు అనే స్పృహ కూడా లేకుండా తప్పుడు ఫిర్యాదులు చేసి, అమర్నాథ్ రెడ్డిని అరెస్ట్ చేసి అడ్డు తొలగించుకునే వ్యూహం కావచ్చు.
అయితే దీని పై తెలుగుదేశం పార్టీ దీటుగా స్పందించింది. ఇవన్నీ అక్రమ కేసులు అని, అతను కిడ్నాప్ కాకపోయినా, కిడ్నాప్ అయ్యారు అంటూ తప్పుడు ప్రచారం చేసి, భయభ్రాంతులకు గురిచేసే చర్యలో భాగంగానే, ఇలా తప్పుడు ఫిర్యాదులు చేసి, అరాచకం చేస్తున్నారని అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. అయితే కొద్ది సేపటి క్రితం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేస్తూ, కుప్పం 14వ వార్డు అభ్యర్థిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని అన్నారు. నామినేషన్ కాపాడుకునేందుకు ప్రకాష్ జాగ్రత్త పడ్డాడని, నామినేషన్ల ఉపసంహరణ ముగిసే వరకు ఆయన జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. కొద్ది సేపటి క్రితం హైడ్రామాకు తెర దించుతూ వీడియో విడుదల చేసారు టీడీపీ అభ్యర్థి ప్రకాష్. సొంత పనుల మీద బయటికి వెళ్తే, కావాలనే పుకార్లు సృష్టించారని అన్నారు. అయితే ఇదే 14వ వార్డులో నాలుగు రోజుల క్రితం వెంకటేష్ అనే వ్యక్తి నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని వెళ్ళిన సంగతి తెలిసిందే.