కుప్పం ఎన్నికల ప్రహసనం ముగిసింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. తిరుపతి ఎన్నికల్లో లాగానే దొంగ ఓట్ల దందా కుప్పంలో జరపటానికి వైసీపీ ప్లాన్ చేసింది. అయితే ముందు నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, అధికారులు సహకరించకపోయినా సరే, చేతనైన కాడికి వారిని అడ్డుకుంటూ వచ్చారు. తిరుమల తరహా అయితే, ఇక్కడ జరగలేదు అనే చెప్పాలి. కుప్పం ప్రజలు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి, ఈ దొంగ ఓటర్లను పట్టుకున్నారు. ప్రతి నిమిషం, ప్రతి గంటా వైసీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తూ టిడిపి శ్రేణులు ముందుకు కదిలాయి. మధ్యానం ఒంటి గంట సమయంలో వైసీపీ ఒక పెద్ద ట్రాప్ వేసింది. కుప్పంలో టిడిపి ఆఫీస్ దగ్గరే, టిడిపి శ్రేణుల పై లాఠీ చార్జ్ చేపించారు. ఈ సంఘటన తెలుసుకుని, వివిధ బుతుల్లో ఉన్న టిడిపి శ్రేణులు, మీడియా మొత్తం అక్కడకు చేరుకున్నాయి. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీరంతా ఇటు రాగానే, దొంగ ఓటర్లు యధేచ్చగా బూత్లలోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు లాఠీచార్జ్ పై ఆందోళన చేస్తున్న టిడిపి శ్రేణులు, పదే పది నిమిషాల్లో వ్యూహం మార్చేసాయి. వెంటనే ఇక్కడ నుంచి అందరూ బూత్ల వద్దకు వెళ్ళిపోయి, అక్కడ దొంగ ఓటర్ల భరతం పట్టారు.

kuppam 15112021 2

ఇక్కడ నుంచి పోలీసులు వెళ్ళనివ్వక పోయినా, వారు తప్పించుకుని అక్కడకు వెళ్లి, దొంగ ఓటర్లను పట్టుకున్నారు. మెరుపు వేగంతో టిడిపి వ్యూహం మార్చింది. ఒక వేళ టిడిపి ఇంకా లాఠీచార్జ్ దగ్గరే ఒక అరగంట ఉండి ఉంటే, దొంగ ఓట్లు అన్నీ పోలు అయిపోయేవి. ఈ విధంగా వైసీపీ పన్నిన ఒక భారీ కుట్రను టిడిపి భగ్నం చేసింది. ఉదయం నుంచి బస్సుల్లో వచ్చిన స్థానికేతరులను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసులు ఎక్కడా చర్యలు తీసుకోలేదని టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఛైర్మన్ అభ్యర్థి సుధీర్ ఉన్న 16వ వార్డులో వైసీపీ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఆ వార్డులో భారీగా స్థానికేతరులను దింపి, దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా విజయవాణి కళాశాల వద్ద వైసీపీ దొంగ ఓటర్లను డంప్ చేసింది. అక్కడకు వెళ్లి టిడిపి నేతలు, మీడియా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తానికి ఉదయం నుంచి టిడిపి శ్రేణులు, దీటుగా వైసీపీ అధికార బలాన్ని ఎదుర్కున్నాయి. ఎన్ని దొంగ ఓట్లు వేసినా, 80% ప్రజలు తమ వైపే ఉన్నరని టిడిపి అంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read