మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై నారా.చంద్రబాబు గారిని కలసి గొట్టిపాటి.రవికుమార్, కుందుర్తి గ్రామ ప్రజలు చర్చించారు. ఈ సందర్భంగా, కుందుర్తి గ్రామ ప్రజలతో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, కుప్పంలో జరిగిన అరాచకం పై వివరించారు. "గతంలో మనం బలవంతపు ఏకగ్రీవాలపై హైకోర్ట్ నుండి అర్డర్ తీసుకొని రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కు రాజ్యాంగం అధికారం ఇచ్చింది. అధికార యంత్రాగం సక్రమంగా పని చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాధారణంగా పంచాయితీ ఎన్నికలకు రాత్రి 7నుంచి 9 గంటల వరకు లెక్కిస్తారు. కానీ వైపీపీ ప్రభుత్వం కావాలని రాత్రి 12గంటలు చేయడం ఆ టైమ్ లో ప్రశ్నించిన వారిపై బెదిరించడం లేదా దా-డి చేయడం జరిగింది. పోలింగ్ బూత్ లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టీడీపీ ఎజెంట్లకు నీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. వైసీపీ నాయకులు దుర్మార్గులు. సొంత బాబాయ్ ను చం-పి ఎవరు చం-పారని అంటున్నారు. ఆయన కుమార్తె సీబీఐ విచారణ కోరితే నీకు తెలియదని గమ్మునుండమని చెప్పారు. తరువాత ఆమె కోర్టుకు వెళ్లి సీబీఐ ఎంక్వైరీ వేయిస్తే ఆ కేసు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో గెలుపు కోసం దాదాపు రూ.20కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజల మనోభావాలతో వైసీపీ నాయకులకు అవసరం లేదు. ప్రజలను బెదిరిస్తే జరిగిపోతుందని వైసీపీ నాయకులు బావిస్తున్నారు. మీకు జరిగిన అన్యాయం పై ఎలక్షన్ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేయండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఆ తరువాత కోర్టులకు వెళ్దాం. మీకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేద్దామన్నారు. ప్రజాస్వామ్యం కోసం, మన గ్రామం కోసం పోరాటం చేస్తే మన మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రజలు మనకు మెజార్టీ ఇచ్చారు..దానిని వైసీపీ నాయకులు రివర్స్ చేశారు. ఈ రోజు మీకు, మీ గ్రామానికి జరిగిన అన్యాయం భవిష్యత్తు లో వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత నాదన్నారు. పార్టీ కోసం సర్వశక్తుల వడ్డి పోరాటం చేసిన వ్యక్తులకు మంచి గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు."

చంద్రబాబునాయుడుతో ప్రకాశం జిల్లా కుందుర్తి పంచాయతీ ప్రజలు: "అద్దంకి నియోజకవర్గం, సంతమాగులూరు మండలం, కుందుర్తి గ్రామ పంచాయితీలో 12వార్డులకు గాను టీడీపీ 8వార్డులు గెలవడం జరిగింది. 8వార్డుల మీద టీడీపీ కి 272 ఓట్ల మోజార్టీ రావడం జరిగింది. చివరి రౌండ్ వరకు టీడీపీ 103 ఓట్ల మోజార్టీతో కొనసాగింది. సర్పంచ్ ఓట్ల లెక్కింపులోను తెదేపా అభ్యర్థి చావల. ముందంజలో ఉండటంతో అధికారపార్టీ విద్యుత్ సరఫరా నిలిపివేయించి అక్రమాలకు పాల్పడింది. ఎన్నికల అధికారుల(ఆర్వో)పై ఒత్తిడి తెచ్చి,109 చెల్లని ఓట్లుగా చెప్పి ఏకపక్షంగా వైసీపీ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించారు. వాటిని ఎందుకు లెక్కించరని అడిగినందకు రాత్రి ఒంటిగంట వరకు మంచీనీళ్ళు ఇవ్వకుండా గదిలో బంధించి బెదిరించారు. మాకు అన్యాయం జరిగిందని రోడ్డుకెక్కినందుకు మహిళాలని చూడకుండా 200మంది పోలీసులు కొట్టారని వాపోయారు. గడచిన 20 మాసాలలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత మొదలైందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దాడులు, అరాచకాలపై డీజీపీ సమాదానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. "

Advertisements

Advertisements

Latest Articles

Most Read