ఈ రోజు హైకోర్టులో కుప్పం ఎన్నికల విషయంలో దాఖలు అయిన పిటీషన్ పై విచారణ జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో, బయట వ్యక్తులు ఎవరూ కూడా కుప్పం వచ్చి ప్రచారం చేయకూడదు అంటూ, తన అనుమతి తీసుకోవాలని, అనుమతి తీసుకోకుండా ప్రచారం చేయకూడదని, అక్కడ డీఎస్పీ జారీ చేసిన సర్క్యులర్ పై, తెలుగుదేశం పార్టీ తరుపున కుప్పంలో పోటీ చేస్తున్న అభ్యర్దులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. ఈ లంచ్ మోషన్ పిటీషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ చేస్తామని ఒప్పుకుంటూ, మధ్యానం ఈ పిటీషన్ పై విచారణ చేస్తామని చెప్పింది. మధ్యానం తరువాత ఈ పిటీషన్ పై సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ వాదనలు సందర్భంగా ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కులు ఉల్లంఘిస్తూ, ఈ సర్క్యులర్ ఉందని చెప్పి చెప్పటంతో పాటుగా, ప్రత్యర్ధి పక్షం ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు బయట నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నప్పుడు, మరో పక్షం వారు ఈ విధంగా వ్యవహరించటం ఏమిటి అంటూ కూడా, ఆయన ప్రశ్నించారు. అదే విధంగా ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోవటం అనేది ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు పొందే హక్కు అని, దాన్ని ఎవరూ కాదనలేరు అంటూ, ఆయన ఈ సందర్భంగా వాదించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ జారీ చేసిన సర్క్యులర్ ను ఆయన హైకోర్టు ముందు ఉంచారు. హైకోర్టు ఈ సర్క్యులర్ ని పరిశీలించిన అనంతరం, ఈ సర్క్యులర్ ని సస్పెండ్ చేసింది. కొట్టివేసింది. అదే విధంగా ఎవరు అయితే, తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారో, వారి పైన కేసులు ఉన్నాయని, వారిని అక్కడ నుంచి తరలించటమే కాకుండా, వారిని మళ్ళీ ప్రచారం చేసుకునేందుకు, తమ అనుమతి తీసుకోవాలని చెప్పి, అక్కడ డీఎస్పీ ఆంక్షలు విధించారని చెప్పి, ఈ విషయం కూడా హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అమర్ నాద్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన పులవర్తి నాని, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, అదే విధంగా మునిరత్నం, వీరి నలుగురినీ కూడా అక్కడ ప్రచారం చేసుకోనివ్వాలని, వారి పై ఎలానటి అంక్షలు పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఆదేశాలు జారీ చేస్తూ, ఎన్నికల ప్రచారంలో ఆ నేతలు పాల్గున వచ్చని తేల్చి చెప్పింది.