కుప్పం పులకించింది. అభిమాన జనసంద్రమైంది. శుక్రవారం చంద్రబాబు కుప్పం పర్యటన జన జాతరను తలపించింది. జన ప్రభంజనంతో, నిన్నటి చంద్రబాబు పర్యటన ఒక ఉత్సవంలా సాగింది. కుప్పం పసుపుమయమైంది. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు, తమ అభిమాన నాయకుడి కోసం, జన సంద్రం ఉప్పొంగింది. ఇంత అనూహ్య స్పందన రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో టిడిపి శ్రేణుల్లో ఒక విధమైన ఎమోషన్ ఉంది. వైసీపీ అరాచకాలకు సమాధానం చెప్పాలి అనే కసితో ఉన్నారు. దానికి తోడు కుప్పం పైన వైసీపీ చేసిన తప్పుడు ప్రచారం. కుప్పంలో టిడిపి పని అయిపొయింది అంటూ చేసిన తప్పుడు ప్రచారానికి ధీటుగా బదులు ఇవ్వాలని టిడిపి శ్రేణులు అనుకోవటం. అలాగే మంగళగిరిలో టిడిపి కార్యాలయం పైన జరిగిన దా-డి. ఇవన్నీ క్యాడర్ లో కసిని పెంచాయి. ఇక మరో పక్క ప్రజలు. జగన్ పాలన పై విసిగి వేసారి పోయారు. తమకు అండగా ఉండే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు బయటకు రావటమే ఆలస్యం, ప్రజలు ఆయనకు తోడుగా కదిలారు. ఒక వైపు కార్యకర్తలు, మరో వైపు ప్రజలు కదం తొక్కటంతో, చంద్రబాబు కుప్పం పర్యటనకు విశేష స్పందన లభించింది. టిడిపి కూడా ఊహించని ప్రజాధరణ వచ్చింది.
నిన్న ఉదయం చంద్రబాబు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి, కదం తొక్కారు. ఆయన కుప్పం చేరుకోవటానికి సుమారుగా 5 గంటలు పట్టింది. 2 గంటలకు మీటింగ్ ఉండాల్సి ఉండగా, అది కూడా ఆలస్యం అయ్యింది. మరో పక్క పోలీసులు అడ్డగింతలు, వైసీపీ కార్యకర్తల వీరంగం, ఇవన్నీ ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కుప్పం నలు మూలల నుంచి ప్రజలు వచ్చారు. దీనికి తోడు చంద్రబాబు ప్రసంగం కూడా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ఇది నా శపధం అంటూ టిడిపి శ్రేణులను ఇబ్బంది పెడుతున్న వారికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా ఆయనకు లభించిన స్వాగతం, ప్రజల్లో ఉత్సాహం ఎప్పుడూ చూడలేదని టిడిపి శ్రేణులు అంటున్నారు. కార్యకర్తల ప్రతి కదలికలో కసి కనిపించిందని, నిన్నటి పర్యటనే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ధర్మ పోరాటానికి మూలం అని, పర్యటనకు వచ్చిన స్పందన చూసి, ఉబ్బితబ్బిబ్బవుతుంది.