చిత్తూరు జిల్లా కుప్పంలో, నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా, తెలుగుదేశం పార్టీ నేతలు మునిసిపల్ కార్యాలయాలు ముట్టడించారు అని వాళ్ళ అందరి పైనా కేసులు నమోదు చేసారు. మాజీ మంత్రులు అమర్నాద్ రెడ్డి, పులవర్తి నాని, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మరి కొంత మంది నేతలు, మొత్తం 19 మంది నేతల పై కేసులు నమోదు చేసారు. ఈ కేసులు ఉండగా, కుప్పం పురపాలక సంఘంలో, ప్రచారం చేసేందుకు వీలు లేదని చెప్పి, గత రాత్రి టిడిపి నేతలు అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమర్నాద్ రెడ్డి, పులవర్తి నాని చిత్తూరులో వారి స్వగృహాలలో దింపేసారు. అలాగే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని కూడా చిత్తూరులో వదిలేసారు. అయితే అమర్నాద్ రెడ్డి అక్కడ నుంచి తప్పించుకుని మళ్ళీ కుప్పం చేరుకున్నారు. అయితే టిడిపి నేతలు కుప్పం వస్తే మళ్ళీ వారిని అరెస్ట్ చేస్తారని, తెలుగుదేశం పార్టీ నేతలకు ముందస్తు సమాచారం ఉండటంతో, ఈ రోజు హైకోర్టులో తమను అరెస్ట్ చేయకుండా, బెయిల్ ఇవ్వాలని పిటీషన్ మూవ్ చేసారు. ఈ పిటీషన్, లంచ్ మోషన్ పిటీషన్ గా మూవ్ చేయగా, ఈ రోజు మధ్యానం తరువాత లంచ్ మోషన్ పిటీషన్ పై వాదనలు విన్నారు.

hc 10112021 2

ఈ వాదనలు విన్న అనంతరం, హైకోర్టు కొద్ది సేపటి క్రితం ఆదేశాలు ఇస్తూ, వీరిని అరెస్ట్ చేయవద్దు అంటూ ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు తప్పనిసరిగా చట్టపరమైన ప్రక్రియ పాటించి తీరాల్సిందే అనే ఆదేశాలు జారీ చేసింది, హైకోర్టు. ఏ చర్య అయినా ప్రక్రియ ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. మరో పక్క కుప్పం 14వ వార్డు అభ్యర్ధి, తాను ఎక్కడో 300 కిమీ దూరంలో ఉన్నానని, తన నామినేషన్ ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించుకున్నారని చెప్పటంతో, టిడిపి నేతలు మునిసిపల్ కమీషనర్ కార్యాలయంలో నిరసన తెలిపారు. ఇక దొరికిందే చాన్స్ అనుకున్న అక్కడ వైసీపీ పెద్దల ఆదేశాలతో, టిడిపి నేతల పై కేసులు పెట్టారు. దీంతో నిన్న రాత్రి టిడిపి నేతలను కుప్పంలో ఉండటానికి వీలు లేదని చెప్పారు. టిడిపి నేతలు కుప్పం ఎన్నికల ప్రచారంలో పాల్గునకుండా ఉండేందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారు అంటూ, టిడిపి ఆరోపించింది. కుప్పం వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారనే సమాచారం ఉండటంతో, హైకోర్ట్ నుంచి అనుమతి తెచ్చుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read