ఒక చిన్న మునిసిపల్ ఎన్నికల కోసం కూడా వైసీపీ చేస్తున్న హడావిడి, భయబ్రాంతులకు గురి చేయటం, ఇంతకు ముందు ఎన్నడూ ఏపి ప్రజలు చూడలేదు. ఎలాగైనా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పంలో, చంద్రబాబుని ఓడించాలింటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హడావిడి, పడుతున్న కుయుక్తులు చూసి, అసలు ఇది ప్రజాస్వామ్యమేనా అనిపిస్తుంది ? ఒక చిన్న మునిసిపల్ ఎన్నిక కోసం, వ్యవస్థలను నాశనం చేస్తున్న తీరు, నిజంగా ఆందోళనకరం. రేపు అధికారం మారిన తరువాత టిడిపి కూడా మీరు మమ్మల్ని చేసారని, వాళ్ళు కూడా ఇలా చేస్తే, ఇక ఈ రాష్ట్రం ఏమై పోతుంది ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఈ వికృత క్రీడకు ఫుల్ స్టాప్ పాడాల్సిన అవసరం ఉంది. ఇక కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఎలా అయిన గెలవాలని మంత్రి పెద్దిరెడ్డి అధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అరాచకాలకు తెర లేపింది. నామినేషన్లకు ముందే, నామినేషన్లు పడకుండా టిడిపి నేతలను భయపెట్టాలని చూసారు. అయితే ఎవరూ భయపడకుండా అన్ని వార్డుల్లో నామినేషన్లు వేసారు. ఇక తరువాత నామినేషన్ల పరిశీలన సమయంలో నామినేషన్లు తిరస్కరించాలి అని పన్నిన కుట్రను తెలుగుదేశం పార్టీ చేధించింది. ఇక్కడ వరకు తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడింది.

kuppam 10112021 2

అయినా కూడా అక్రమాలు చేసారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రకాశ్‌ నామినేషన్‌ను ఫోర్జరీ సంతకం పెట్టి, ఉపసంహరించుకునేలా చేసారు. దీని పై తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం చెప్పింది సోమవారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. కుప్పం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేసారు. అయితే దీని పైన టిడిపి నేతల పైన కేసు పెట్టారు. ఈ నేపధ్యంలోనే నిన్న రాత్రి కుప్పం బీసీఎన్‌ రిసార్ట్స్‌లో బస చేసిన టిడిపి మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డిని, టీడీపీ చిత్తూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు పులివర్తి నానిలను పోలీసులు అరెస్ట్ చేసారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే మేము రాము అని చెప్పటంతో, నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసారు. వీరితో పాటుగా, ఇతర నేతలను పోలీసులు కుప్పం నుంచి పంపించారు. ఎమ్మెల్యే రామానాయుడుని అర్ధరాత్రి ఒంటి గంటకు కుప్పం దాటి వెళ్ళిపోవాలని,బలవంతంగా పంపించారు. దీని పై రామానాయుడు ఫైర్ అయ్యారు. రేపు పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు వచ్చినా , ఇలాగే చేస్తారా అంటూ పోలీసులు పై ఫైర్ అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read