కుప్పంలో వైసీపీ అరాచకాలు మొదలు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నట్టే, ఇక్కడ వైసీపీ అరాచకాలు మొదలు పెట్టింది. తమ ప్లాన్ అమలు చేస్తుంది. ఇవి పసిగట్టిన తెలుగుదేశం పార్టీ, పక్కా ఆధారాలతో, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మరి ఎలక్షన్ కమిషన్ ఏమి చేస్తుందో కానీ, ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలు ఇచ్చింది. కుప్పం మున్సిపాలిటీలోకి బయట వ్యక్తులు వచ్చారు అంటూ టీడీపీ ఫిర్యాదు చేసింది. కుప్పం నుంచి కాకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తులు కుప్పంలో తిష్ఠవేశారని వారి పై చర్యలు తీసుకుని, వారిని పంపించి వేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ నేత అశోక్‍బాబు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. కుప్పంలో ఇప్పటికే ప్రచార పర్వం ముగిసిందని, అయినా కూడా కుప్పంలో బయట వ్యక్తులు ఇక్కడే ఉన్నారని, వారిని వెంటనే బయటకు పంపించి వేయాలని కోరారు. ముఖ్యంగా పక్క నియోజకవర్గాలు అయిన, పుంగనూరు, తంబాలపల్లి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఇప్పటికే వీళ్ళు అందరూ, కుప్పంలో తిష్ట వేసుకుని కూర్చున్నారని, వారి పై చర్యలు తీసుకోవాలని, వారు ఎక్కడ తిష్ట వేసింది కూడా ఆధారాలు ఇస్తున్నాం అంటూ, ఆ వివరాలు కూడా ఇచ్చారు.
ఇప్పటికే కుప్పం ప్రాంతానికి,15 కిలోమీటర్ల దూరంలో 300 మందికి అన్ని ఏర్పాట్లు చేసి, వారిని అక్కడ ఉంచారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపుగా 300 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర స్థానిక సంస్థల నేతలు వచ్చేసారని తెలిపారు. వాళ్ళు వచ్చిన కారు నంబర్లతో సహా ఫిర్యాదు చేసారు. అలాగే ఓట్లకు డబ్బులు పంచుతున్న వీడియోలు కూడా తమ ఫిర్యాదుకు జత పరిచారు. ఇక కుప్పంలోని రాజా పార్కులో ఉన్న కమ్యూనిటీ హాలులో 60 మందిని ఉంచారని, వాటి ఆధారాలు కూడా ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చారు. అలాగే తంబాలపల్లి నుంచి 500 మంది మహిళలు వచ్చారని, వారికి కూడా కుప్పంలో వసతి కల్పించారని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చారు. కుప్పం వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా వైసీపీ శ్రేణులకు వసతి కల్పించారని, అన్నారు. ఇక దాదపుగా వందమంది డ్వామా ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా రంగంలోకి దింపారని, వారికి సీఎల్‍ఆర్‍సీ భవనంలో వసతి కల్పించారని చెప్తూ, వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇస్తూ, వారి పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరారు.