వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబు ఎలాంటి ప్రత్యర్ది అనేది అందరికీ తెలిసిందే... అలాంటి చంద్రబాబు పై, ఇప్పటికీ మూడు సార్లు పోటీ చేసిన వ్యక్తికి, జగన్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో తెలిస్తే, జగన్ మనస్తత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది... సహజంగా చంద్రబాబు లాంటి బలమైన నేతను ఎదుర్కుని పోటీలో ఇన్నాళ్ళు ఉంటూ వస్తున్నారు అంటే, జగనే ఆయన్ను అన్ని విధాలుగా ఆదుకోవాలి... కాని, ఇక్కడ రివర్స్... ఎలాగూ ఓడిపోతాడు, అతన్ని లెక్క చేసే అవసరం ఏముంది, అలా పడి ఉంటాడు అనుకుని, కనీసం లెక్క చెయ్యక, అవమానాలు పాలు చేస్తే, ఆ నాయకుడు చివరికి జగన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక, మీడియా ముందు కన్నీళ్లు పెట్టున్నారు...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడు , మాజీ జెడ్పి చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి, జగన్ టార్చర్ తట్టుకోలేక,అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు పై సుబ్రమణ్యంరెడ్డి మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఆదివారం అమరావతికి వచ్చిన సుబ్రమణ్యంరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ సందర్బంగా టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అయితే... సీఎం చంద్రబాబు త్వరలో చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీలో చేరేందుకు నిర్ణయించారు.
వారం రోజుల క్రిందట, కుప్పం నియోజకవర్గ వైఎస్సాఆర్సీపిలో పార్టీకి చెందిన అనుచరులు, సన్నిహితులు, వర్గీయులతో సమావేశం నిర్వహించిన సుబ్రమణ్యంరెడ్డి , వైఎస్.రాజశేఖర్‌రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకున్నారు. పార్టీలో చేరిక, ఆ తరువాత జరిగిన పరిణామాలను వివరించారు. వైఎస్సాఆర్సీపిని వీడుతున్నారని ప్రకటిస్తూ ఆ పార్టీతో అనుబంధం తెగిపోతోందని, తనకు పార్టీ పరంగా సరైన గుర్తింపు, ప్రాధాన్యత లేదని కన్నీటి పర్యంతమైయ్యారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనకు చిన్న పదవుల నుంచి జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడం వరకు తనకు ఇచ్చిన ప్రాధాన్యతను సుబ్రహ్మణ్య రెడ్డి కార్యకర్తలకు చెప్పి, జగన్ ఏ విధంగా తనను అవమాన పరిచింది చెప్పారు...