వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైనా చెప్పాడంటే చెయ్యడంతే అని నిర్దారించుకోవచ్చు అనేలా జనం ఫిక్స్ అయిపోయారు. దీనికి మద్యనిషేధం, సీపీఎస్ రద్దు, అమరావతిలోనే రాజధాని వంటివన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ జాబితాలో తాజాగా కర్నూలులో న్యాయరాజధాని కూడా చేరింది. అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన వైఎస్ జగన్ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు నినాదం అందుకున్నారు. విశాఖకి రాజధాని తరలించేందుకు ఈ ఎత్తుగడ వేసినా, మిగిలిన ప్రాంతాల్లో అసంతృప్తి చెలరేగకుండా అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని అంటూ భారీ ప్రచారం చేశాఆరు. కర్నూలులో న్యాయరాజధాని కోసం వైసీపీ చాలా పెద్ద ఎత్తున గర్జించింది. హైకోర్టుని కర్నూలులో పెట్టి న్యాయరాజధాని చేసేందుకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని గర్జిస్తూనే, సుప్రీంకోర్టులో అమరావతి నుంచి హైకోర్టుని తరలించేది లేదని వైసీపీ సర్కారు లాయర్ స్పష్టం చేశారు. న్యాయరాజధాని పేరుతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని సామాన్య ప్రజలకీ అర్థమైపోయింది. విశాఖ ఏకైక రాజధాని అనేది వైఎస్ జగన్ అజెండా అని, కర్నూలుకి కంటితుడుపుగా ఏర్పాటు చేస్తామన్న జ్యుడీషియల్ అకాడమీ కూడా ఉత్తుత్తిదేనని జగన్ సర్కారు జీవో 152 రద్దుతో క్లారిటీ ఇచ్చేసింది. కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకి ఇచ్చినదే ఈ జీవో 152ని రద్దు చేసి మంగళగిరిలోనే జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వైఎస్ జగన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంతో కలకలం రేగుతోంది. జగన్ న్యాయరాజధాని పేరుతో కర్నూలు ప్రాంతంతోపాటు రాయలసీమని మోసం చేశారు జనం ఆగ్రహంతో ఉన్నారు.
కర్నూలు న్యాయ రాజధాని పై వైసీపీ ఇంత మోసమా ? వైసీపీ కోసం టిడిపిపై గర్జించిన మేథావులు ఇప్పుడు ఏమంటారో?
Advertisements