పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు... వార్నింగ్ లు కూడా ఇచ్చారు... కాని, ఎవరూ ఈ మాటలు లెక్క చెయ్యట్లేదు... మేము చేసేది మేము చేస్తాం అంటున్నారు...
కర్నూలు జిల్లా దేవరగట్టులో, దసరా పండుగ రోజున కర్రల సమరం జరుగుతుంది... ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేశారు... నేడు అర్ధరాత్రి కర్రల సమరం జరగనున్నది...
ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈ సందర్భంగా ఎస్పీ గోపినాథ్ శెట్టి మాట్లాడుతూ.. బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయంగా జరుపుకోవాలని సూచించారు.
రింగుల కర్రలతో ఈ ఉత్సవంలో పాల్గొనవొద్దని చెప్పారు. లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మరి అక్కడ ప్రజలు పోలీసులు మాట వింటారా ? ఎప్పటిలాగే తలకాయలు పగలుకొట్టుకుంటారా ? చూడాల్సిందే...
Advertisements