కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మల్సీ ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నికల సంఘం అధికారులు కేఈ ప్రభాకర్ ని ఎమ్మెల్సీగా ప్రకటించారు.అయితే ఈ తతంగం వెనుక చాలా స్టొరీ జరిగింది. అసలు మేము పోటీ చెయ్యట్లేదు అంటూ వైసీపీ జెండా పీకేసిన సంగతి తెలిసిందే... దీంతో అందరూ ఈ ఎన్నిక లైట్ తీసుకున్నారు... కాని, కేఈతో పాటు మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. ఇందుఅలో ఓ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. బీఎస్పీ అభ్యర్థి నామినేషన్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం తిరస్కరించింది.
అయితే ఇక్కడ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు ఎంపీటీసీల సంఘం నేత జయప్రకాశ్ రెడ్డి రంగలో ఉన్నారు.. దీంతో వైసీపీ రంగంలోకి దిగింది... మీరు పోటీలో ఉండాలి అని, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి జర్క్ ఇవ్వాలి అని, ఆర్ధిక సహాయం కూడా చేస్తాము అని కోరింది.. దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి, ఒకటి, ఓడిపోయినా అది వైసీపీ ఖాతాలోకి రాదు... రెండు, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చేత, డబ్బులు ఖర్చు చేపించవచ్చు... ఈ విధంగా ప్రత్యర్ధి పై కక్ష సాధించ వచ్చు అని ప్లాన్ వేసింది... విషయం తెలుసుకున్న తెలుగుదేశం రంగంలోకి దిగింది...
ఎమ్మల్సీ అభ్యర్ధి జయప్రకాశ్ రెడ్డి చేత నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేసి, సక్సెస్ అయ్యింది.. ఈ క్రమంలోనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకుంది. దీంతో అప్పటి వరకు తన వర్గం అనుకున్న బైరెడ్డి లాంటి నేత కూడా తెలుగుదేశం వైపు తిరగటంతో, అనవసరంగా ఈ విషయంలో కల్పించుకుని, ఒక నేతను పోగుట్టుకున్నాం అని వైసీపీ బాధపడుతుంది. మొత్తానికి, చివరి నిమషం వరకు ఎదో చేసేద్దాం అనుకుని ఆరాటపడి, చివరకు పోరాటం చెయ్యకుండా చేతులు ఎత్తేసింది వైసీపీ.