టిడిపి జాతీయ అధ్యక్ష్యుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసిపీ సర్కార్ మరో కేసు నమోదు చేసింది. ఈ నెల 6న చంద్రబాబు విలేఖరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క-రో-నా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో భారీగా పాజిటివ్ కేసులతో పాటు, మరణాలు కూడా సంభవీస్తున్నాయి, క-రో-నా కట్టడి విషయంలో వైసీపీ సర్కార్ వైఫల్యం చెందిందని, దీంతో అక్కడ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా సిసిఎంబి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్ లో పుట్టిన, N440K అనే ఒక వైరస్ వేరియంట్, కర్నూల్ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు విస్తరించిందని, ఆ వేరియంట్ ప్రభావంతోనే, ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి, అనేక పత్రికల్లో ఈ వేరియంట్ పై వార్తలు వచ్చినా, ప్రభుత్వం పట్టించుకోలేదు అంటూ, చంద్రబాబు ఆగహ్రం వ్యక్తం చేసారు. అయితే ఈ అంశం పై కర్నూల్ కు సంబందించిన సుబ్బయ్య అనే ఒక న్యాయవాది, కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో, కేసు నమోదు చేసారు. N440K అనేది అంత ప్రభావం చూపించేది కాదని, మ్యుటేషన్ లో అంత సీరియస్ గా కానీ, ఎక్కువ మరణాలు సంభవించేదిగా లేదని, అయితే చంద్రబాబు మాత్రం, దాన్ని బూచిగా చూపించారని అన్నారు.

cbn 09052021 2

ప్రజల్లో భయం వచ్చేలా చేసారని, కర్నూల్ లో ఉన్న ప్రజలు అంతా, తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారని, కర్నూల్ లో ఏది జరిగిపోతుంది అంటూ, చంద్రబాబు విషం చిమ్మారు అంటూ, కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సుబ్బయ్య అనే అడ్వొకేట్ కేసు నమోదు చేసారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు, సెక్షన్ 105, అదే విధంగా 505 సెక్షన్ల కింద చంద్రబాబుకు నోటీసులు జారీ చేయటానికి, కర్నూల్ పోలీసులు , హైదరాబాద్ వచ్చారు. చంద్రబాబు నివాసానికి పోలీసులు వచ్చి, నోటీసులు ఇవ్వనున్నారు. నిన్న ఎస్పీ పక్కీరప్ప మాట్లాడుతూ, ఏడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని చెప్తామని అన్నారు. అయితే ఈ విషయం పై తెలుగుదేశం శ్రేణులు మండి పడుతున్నాయి. ప్రభుత్వాన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పటం, ప్రభుత్వ అసమర్ధతను చెప్పి, ప్రభుత్వం పై ఒత్తిడి తేవటం, ప్రతిపక్షాలు చేసే పని అని, ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినా తప్పేనా అంటూ, తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read