రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విసిరిన సవాల్‌కు చర్చకు సిద్ధమని ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పష్టంచేశారు. చర్చకు భాజపా సిద్ధమా అని ప్రతి సవాల్‌ విసిరారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోటీచేసిన భాజపా అభ్యర్థులెవరైనా ఎంపీగా డిపాజిట్‌ తెచ్చుకుంటే రూ.5లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు డిపాజిట్‌ వస్తే రూ.10లక్షలు ఇస్తానన్నారు. ఇక భాజపా నుంచి ఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచినా రూ.15లక్షలు ఇస్తానని వెల్లడించారు. ఈ నగదు బహుమతిని తన సొంత డబ్బునే ఇస్తానని స్పష్టంచేశారు. కన్నా లక్ష్మీనారాయణ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

kanna 28032019

ప్రత్యేక హోదాతో ఇచ్చే రాయితీలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని 2016 సెప్టెంబరులో కేంద్రం ప్రకటించిందన్నారు. ఆ తర్వాతే ప్యాకేజీకి అంగీకరిస్తూ చంద్రబాబు 2016 అక్టోబర్‌ 24న లేఖ రాశారని, దాన్నే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చూపించారని స్పష్టం చేశారు. విదేశీ ఆర్థిక సాయం(ఈఏపీ)తో చేపట్టిన ప్రాజెక్టుల్లో అప్పటివరకూ ఆమోదించినవి, ఇంకా ఆమోదించాల్సినవి ఎన్ని ఉన్నాయో వంటి వివరాలను ఆ లేఖలో పేర్కొన్నామని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. ప్యాకేజీ కింద రాష్ట్రానికి రూ.17,500 కోట్లు ఇస్తామన్న కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. బుధవారం ఉండవల్లిలో కుటుంబరావు విలేకరులతో మాట్లాడారు.

kanna 28032019

‘‘ప్రత్యేక ప్యాకేజీ ద్వారా హోదాతో సమానంగా 90:10 నిధులు ఇస్తే రాష్ట్రానికి రూ.17,500 కోట్లు వస్తాయి. దీనికింద ఏటా రూ.3,500 కోట్ల చొప్పున రాష్ట్రానికి వస్తాయి. అదే విషయాన్ని ఉత్తరంలో పేర్కొన్నాం. ప్యాకేజీకి అంగీకరించాక ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా భాజపా రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసింది. రాష్ట్రానికి ఐదేళ్ల రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం చెబితేనే ఆర్థిక సంఘం రూ.5,528 కోట్లకు బదులుగా రూ.22,113 కోట్లు ఇచ్చిందని భాజపా నేతలు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం ఈ అంశంపై చర్చించినట్లు సాక్ష్యాలుంటే చూపించాలి? 42 శాతం వాటా కింద రాష్ట్రాల లోటు పూడ్చాలి కాబట్టి అదే సాయాన్ని ఇచ్చారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం చేసిందేముంది? రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకూ రూ.22,113 కోట్లు మాత్రమే వచ్చాయి. అన్ని రాష్ట్రాలకూ ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారు. వాన్‌పిక్‌ను తెలంగాణ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారు అందులో ఈక్విటీ కొన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోల కొత్త పాలసీపై రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరాలున్నాయి. అందుకే డీపీఆర్‌ పంపడంలో ఆలస్యమయింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదనడం ఎంత వరకు సమంజసం?’’ అని నిలదీశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read