అమరావతి బాండ్ల ద్వారా నిధులు సేకరణ ప్రభుత్వానికి ముమ్మాటికీ లాభదాయకమేనని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలూ ఇలాగే బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకుంటున్నాయని తెలిపారు. ఇప్పుడు తాము తెచ్చిన దాని కన్నా తక్కువ వడ్డీరేటుకు అంటే 10 శాతానికి ఇప్పిస్తే అరేంజ్‌ ఫీ ఇప్పిస్తామని ప్రతిపక్ష నేతలకు, మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుకు, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సోమవారం సచివాలయంలో కుటుంబరావు విలేకరులతో మాట్లాడారు. ‘ బ్లాక్‌మనీ అని అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. బ్లాక్‌మనీని బాండ్లలో పెట్టడం ఎలా సాధ్యమవుతుంది? ఈ నెల 27న బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో పెట్టుబడి పెట్టినవారి అందరి పేర్లు ఉంటాయి. అందరూ చూడవచ్చు. ప్రతిపక్షం చేసే ఆరోపణల్లో నిజం లేదు. కొన్ని పత్రికల రాతలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. "

kutumbrao 21082018 2

"కొంత మంది రిటైర్డ్‌ అధికారులు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకు రూ.1,500 కోట్లే ఇచ్చింది. ప్రపంచబ్యాంకు రుణం మంజూరు ఆలస్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో పనులు ఆగకుండా.. అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో సీఆర్డీఏ నిధులు సేకరిస్తోంది. సంస్థ ఆదాయ మార్గాలు, వడ్డీ, అసలు చెల్లింపుల సామర్థ్యం వంటి పలు అంశాల ఆధారంగా వడ్డీరేటు నిర్ణయిస్తారు. ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ అయితే ఒక రేటు, డబుల్‌ ఏ రేటింగ్‌ అయితే ఒక రేటు ఉంటుంది. మనకు ఏ ప్లస్‌ రేటింగ్‌ వచ్చింది. ఈ రేటింగ్‌కు ఈ రోజు వడ్డీరేటు 10.48 శాతంగా ఉంది. మనం చెల్లించేది 10.32 శాతమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరఽథ ప్రాజెక్టు నిధులకు 10.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తోంది."

kutumbrao 21082018 3

"దేశంలోని పలు ప్రభుత్వాలు ఈ విధంగా బాండ్లు విడుదల చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌, జీహెచ్‌ఎంసీ వంటివి కూడా బాండ్ల ద్వారా రుణం తీసుకున్నాయి. యూపీ బాండ్లకు ప్రభుత్వ సబ్సిడీలను కూడా సెక్యూరిటీగా పెట్టారు. సాధారణంగా బ్యాంకులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంతోపాటు భూములు కూడా తాకట్టు పెట్టాలి. అమరావతి బాండ్లకు ప్రభుత్వం గ్యారెంటీ మాత్రమే ఇస్తోంది. భూములు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. బాండ్ల జారీలో సీఆర్డీఏ ఎటువంటి తప్పూ చేయలేదు. అప్పు చేయకుండా కేంద్రంలో కూడా ఏ పనులూ జరగవు. జాతీయ రహదారుల నిర్మాణానికి అప్పు తీసుకుంది." అని కుటుంబరావు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read