అమరావతి బాండ్లకు బొంబాయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్సీఈ) లో అద్వితీయమైన స్పందన వచ్చినట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తెలిపారు. ఏపీ సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2 వేల కోట్ల విలువ గల బాండ్లు జారీ చేసిన గంట వ్యవధిలోనే బీఎస్సీఈలో మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరినట్లు చెప్పారు. ఆశించిన దానికంటే ఒకటిన్నర రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయిందని, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే ఇంత స్పందన వచ్చిందని.. ఇది గొప్ప విజయమని అన్నారు. అమరావతి బాండ్ల విడుదలతో జాతీయ, అంతర్జాతీయ మదుపరుల్లో రాష్ట్ర ఇమేజ్ పెరిగిందని చెప్పారు.

kutumba 28082018 2

ముంబయిలో నిన్న జరిగిన బాండ్ల లిస్టింగ్‌ (బాండ్లను కొనుగోలు చేసిన సంస్థలకు స్టాక్‌ మార్కెట్‌లో ఇతరులకు విక్రయించుకునే వీలు కల్పించడం) కార్యక్రమానికి దేశంలోని వ్యాపార దిగ్గజాలు హాజరైనట్లు తెలిపారు. ముఖేష్ అంబానీ, గోద్రెజ్, కుమార మంగళం బిర్లా, మహేంద్ర గ్రూప్ ప్రతినిధులు, బీకే గోయంకా, రహేజా సంస్థ ప్రతినిధులు తదితరులు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి కనబరిచారని, విదేశీ పెట్టుబడిదారులు కూడా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారని చెప్పారు.

kutumba 28082018 3

ఏపీకి కేంద్రం సాయం చేయకపోయినా చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రాభివృద్ధిని చూసి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారు ఓర్వలేకపోతున్నారని, ఈర్ష్యతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బాండ్ల విడుదల వ్యవహారం అంతా పారదర్శకంగా జరిగిందని, ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు రుజువు చేసినా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కుటుంబరావు తెలిపారు. రుజువు చేయలేని పక్షంలో జీవీఎల్ రాజీనామా చేస్తారా? కనీసం క్షమాపణలైనా చెబుతారా? అని అడిగారు. ఎందుకు ఇలా విషం కక్కుతున్నారో అర్ధం కావడం లేదని, ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారు నష్టపోతారని చెబుతున్నారని, వారు ఎలా నష్టపోతారని కుటుంబరావు ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read