జీవీఎల్ కి ప్రతి వారం కోటింగ్ ఇచ్చే కుటుంబరావు, ఈ రోజు సాక్షిలో వచ్చిన తప్పుడు వార్తా పై ఫైర్ అయ్యారు. జగన్, సాక్షి పత్రిక రాసిన కథనాలపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి బాండ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని సీరియల్లా వేస్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారని, ఈ బుడబుక్కల రాతలు మానేయాలని సూచించారు. ఆర్థిక ఉగ్రవాదం మానేయాలని, ఆర్థిక ఉగ్రవాదానికి మంచి ఉదాహరణ వైసీపీనే అని కుటుంబరావు విమర్శించారు. ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగేలా ఆరోపణలు చేయవద్దని హితవు పలికారు.
2, 3 వారాల్లో జగన్ కు సంబందించిన ఒక కొత్త విషయం బయటపెడతామన్నారు. అప్పుడు మొహం చూపించుకోలేక దాచుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. నీతిమంతుల్లా మాస్కులు వేసుకుని బయట తిరుతున్నారని విమర్శించారు. సాక్షి మీడియాలో రాసిన ఆర్టికల్లో నిజం లేదన్నారు. తక్కువ వడ్డీకి అప్పు ఇప్పిస్తానంటే స్వాగతిస్తామని కుటుంబరావు స్సష్టం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యల పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, 16 నెలలు జైలులో ఉండి వచ్చి కూడా, సిగ్గు లేకుండా ఎదో ఘనకార్యం చేసినట్టు జగన్ బయట తిరుగుతున్నాడు.
అలాంటి జగన్, సిగ్గు పడే విషయం, తల కూడా ఎత్తుకొలేని విషయం అంటే, ఏంటా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి, కుటుంబరావు గారు చెప్పిన స్టొరీ, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈయన జగన్ కు సంబంధించి, ఏ విషయం చెప్తారా అని అందరూ, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది అవినీతికి సంబంధించన విషయమా, లేక ఇంకా ఏమన్నానా అనే సందేహాలు వస్తున్నాయి. మరో పక్క జగన్ ను వెనకేసుకుని వస్తున్న ఉండవల్లితో గత కొన్ని రోజులగా, మాటల యుద్ధం నడుస్తుంది. జగన్ అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టే ‘‘క్విడ్ ప్రోకో’’ కింద ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని కుటుంబరావు ఆరోపించారు. జగన్ అవినీతిపరుడు కాదని మీ దగ్గర ఆధారాలుంటే.. వాటిని కోర్టులో ప్రవేశపెట్టొచ్చు కదా అని ఉండవల్లిని ప్రశ్నించారు.