రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస పార్టీ, ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో అడ్డ్రెస్ లేకుండా పోయింది. అయితే ఈ పార్టీ నేతలు మాత్రం సేఫ్ గేం ఆడారు. అప్పట్లో రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులు అందరూ, కాంగ్రెస్ పార్టీని దోషిగా చేసి, వారి రాజకీయ భవిష్యత్తు కోసం, జగన్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ అడ్డ్రెస్ లేకుండా పోయింది. రాజకీయంగా వైఎస్ ఫ్యామిలీ ఎదగటానికి కారణం అయిన కాంగ్రెస్ పార్టీని కూడా జగన్ రెడ్డి వెన్ను పోటు పొడిచారని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది. నిజానికి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు అయిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు. రాష్ట్రంలో కేవలం టిడిపి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో, కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేకపోవటంతో, వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితిలో, జగన్ మోహన్ రెడ్డి ఆదరణ రోజురోజుకీ తగ్గి పోతూ ఉండటంతో, ఆ ఓటింగ్ ఇతర ప్రతిపక్షాలకు వెళ్ళకుండా, గతంలో తమకు ఓటు వేసిన వారినే మళ్ళీ తమ వైపు తిప్పుకోవటానికి కాంగ్రెస పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. దేశమంతా వివిధ రాష్ట్రాలలో నాయకత్వ మార్పు చేసి, ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణాలో రేవంత్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చిన తరువాత, అక్కడ సీన్ మారిపోయింది.

kvp 12082021 2

రేవంత్ దుమ్ము దులుపుతూ, పాత కాంగ్రెస్ నేతలను మళ్ళీ కాంగ్రెస్ వైపు తీసుకుని వస్తూ, ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా, అలాంటి గట్టి నేత కోసం కాంగ్రెస్ పార్టీ వెతుకుతుంది. ఈ ప్రణాళికలో భాగంగానే, నిన్న రాహులు గాంధీ ఏపి కాంగ్రెస్ నాయకులను పిలిపించారు. కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ, పల్లం రాజు, హర్ష కుమార్, శైలజానాద్ సహా ఇతర నేతలు నిన్న రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. తిరిగి పార్టీ పుంజుకునే విషయం పై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన, ఇతర సామజిక అంశాల గురించి చర్చ జరిగింది. అయితే ఈ మొత్తం బాధ్యతను రాహుల్ గాంధీ కేవీపీకి అప్ప చెప్పారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మళ్ళీ మన వైపు రావాలి అంటే ఏమి చేయాలో ప్రణాళిక ఇవ్వమని కేవీపీని రాహుల్ కోరినట్టు తెలుస్తుంది. గతంలో వైఎస్ఆర్ ఆత్మగా ఉన్న కేవీపీకి, జగన్ బలహీనతలు అన్నీ తెలుసు కాబట్టి, కేవీపీకి కీలక బాధ్యతలు అప్ప చెప్పినట్టు తెలుస్తుంది. జగన్ ఓటు బ్యాంకుని మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్ళించటానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read