కేవీపీ రామచంద్రరావు.. ఈయన పేరు తెలియని వారు ఉండరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరు ఉంది. రాజశేఖర్ రెడ్డి సియంగా ఉన్న సమయంలో, ఆయన సలహాదారుడు. రాజశేఖర్ రెడ్డి తరువాత, మోస్ట్ పవర్ఫుల్. అయితే జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో కానీ, ఇతర కేసుల్లో కానీ ఎక్కడా కేవీపీ కనిపించరు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో, ఎంతో ముఖ్యమైన కేవీపీ, ఎక్కడా కేసుల్లో ఉండకపోవటం ఆశ్చర్యకరమే. ఎందుకు అంటే, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కేసుల్లో ఉన్నా కేవీపీ మాత్రం ఎక్కడా పిక్చర్ లో కనిపించ లేదు. అయితే మొదటి సారి ఇప్పుడు కేవీపీ పేరు తెర మీదకు వచ్చింది. ఓబుళాపురం మైనింగ్ గురించి తెలిసిందే. ఇది రాజశేఖర్ రెడ్డి, తన పెద్ద కొడుకు అని పిలిచుకునే గాలి జనర్ధర్ రెడ్డిది. గాలి జనర్ధర్ రెడ్డికి ఓబుళాపురం మైన్స్ ఇవ్వటంలో, అప్పటి అధికారి శ్రీలక్ష్మి కీలక పాత్ర వహించారు. దీంతో ఆమె పైన కేసు నమోదు అయ్యింది. అయితే సిబిఐ తన మీద కేసు నమోదు చేయటం పైన శ్రీలక్ష్మి కోర్టుకు వెళ్ళారు. కేసు నుంచి తప్పించాలని కోరారు. ఈ కేసు నిన్న తెలంగాణా హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సిబిఐ వాదనలు వినిపిస్తూ, శ్రీలక్ష్మిని విడిగా చూడాల్సిన అవసరం లేదని, ఈ కేసులో ఆమె పాత్ర కూడా ప్రముఖంగా ఉందని వాదించారు.

srilakshmi 09122021 2

ఆమె అధికార దుర్వినియోగం చేసారని, నిబంధనలు పాటించలేదని వాదించారు. అక్రమంగా లీజు కట్టబెట్టారని అన్నారు. కేంద్రం నుంచి అనుమతి రాక ముందే, గాలి జనర్ధర్ రెడ్డి పర్మిషన్ ఇచ్చారని అన్నారు. లీజ్ కోసం శశికుమార్‌ అనే వ్యక్తి రాగా, పట్టించుకోకుండా, ఎకువ డబ్బులు కట్టాలని చెప్పారని చెప్తూ, అతని వాంగ్మూలం చదివి కోర్టుకు వినిపించారు. తాను శ్రీలక్ష్మిని కలిసినప్పుడు, ఇది చాలా పెద్ద వ్యాపారం అని, కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారని, అధికారులకు ఎంత ఎంత ఇవ్వాలో, వెళ్లి కేవీపీని కలవాలని చెప్పారని, కోర్టుకు చదివి వినిపించారు. దీని పైన కోర్టు స్పందిస్తూ, మరి ఈ విషయంలో కేవీపీ వంగ్మూలం తీసుకున్నారా అని సిబిఐ ని ప్రశ్నించింది. అయితే కేవీపీ వాంగ్మూలం తీసుకోలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. మరో పక్క శ్రీలక్ష్మి తరుపు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, విచారణను వాయిదా వేసింది. కేవీపీ వంగ్మూలం విషయంలో, సిబిఐకి ఆదేశాలు ఇచ్చే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read