సోషల్ మీడియాలో మొన్నటి వరకు, ఫేక్ బ్యాచ్ ఎవరు అంటే గుర్తొచ్చేది, లోటస్ పాండ్ బ్యాచ్... ఈ లోటస్ పాండ్ బ్యాచ్ సరిగ్గా ఫేక్ చెయ్యటం లేదు అని, బీహార్ నుంచి దేశంలోనే టాప్ ఫేక్ బ్యాచ్ గా పేరు ఉన్న, ప్రశాంత్ కిషోర్ ని కిరాయికి పెట్టుకున్నాడు, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్... ప్రజల్లో భరోసా నింపి, తద్వారా ప్రజా బలంతో రాజకీయాలు చెయ్యల్సింది పోయి, ఇలాంటి ఫేక్ బ్యాచ్ తో, రాజకీయాలు చేసి, ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించి, ప్రజలని కన్ఫ్యుస్ చేసి, లబ్ది పొందాలి అని జగన్ ప్లాన్... కాని ఈ ప్లాన్ లో, ఒకటికి పది సార్లు, దొరికిపోయినా, ప్రజలు ఛీ కొడుతున్నా, జగన్ మాత్రం ఈ పంధా వదలటం లేదు...
తాజాగా, ఈ ఫేక్ బ్యాచ్ చేసిన మరో ఉదంతం, బోగస్ అని తేలిపోయింది... ఒక పక్క, ఎన్ని కిలోమీటర్లు నడిచినా, మైలేజి రావటం లేదు... ప్రజల్లో జగన్ అనే వాడు ఒకడు ఉన్నాడు అనే గుర్తింపు కూడా లేదు... అందుకే కిరాయి బ్యాచ్ ని ఎదో ఒకటి చెయ్యమని, జగన్ ఆదేశించాడు... ఇంకేముంది, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ రంగంలోకి దిగింది... సర్వేలు పర్ఫెక్ట్ గా చెప్పే, మాజీ పార్లిమెంట్ సభ్యుడు, లగడపాటి రాజగోపాల్ ని ఎంచుకున్నారు.. లగడపాటి రాజగోపాల్, ఏదన్నా సర్వే చెప్పారు అంటే, అది అటు ఇటుగా, నిజం అవుతుంది అనే అభిప్రాయం చాలా మందికి ఉంది... ఇదే నమ్మకాన్ని వాడుకుంది జగన్ బ్యాచ్...
లగడపాటి రాజగోపాల్ ఒక సర్వే చేసారు అని, వచ్చే ఎన్నికల్లో, వైసిపీకి 105 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 55 సీట్లు, జనసేనకు 15 సీట్లు వస్తాయి అంటూ, ఒక ఫేక్ సర్వే పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రమోట్ చేసింది... చివరకు జగన్ అనుకూల మీడియాలో కూడా ఈ వార్త రావటంతో, స్వయంగా లగడపాటి రాజగోపాల్ స్పందించారు... ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ చేసిన పని గురించి మాట్లాడుతూ "అసలు నేను ఎక్కడా సర్వే చేయించలేదు... ఈ మధ్య కాలంలో ఏ సర్వే చేయలేదు... ఒక వేళ నేనంటూ చేయిస్తే మీడియాకు చెబుతా కదా.. నా పేరుతో వచ్చే సర్వేలు నమ్మవద్దు... నేను ఏ సర్వే చేసినా, ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను" అంటూ రాజగోపాల్, జగన్ బ్యాచ్ చేసిన అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు...