విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఆయన పేరు చెప్తే, ముందుగా గుర్తుకు వచ్చేవి సర్వే ఫలితాలు... ఆయన ఏదన్నా సర్వే చేసారు అంటే, అది నిజం అయ్యి తీరుతుంది అని అనేక సార్లు రుజువు అయ్యింది. అందుకే సోషల్ మీడియాలో అన్ని పార్టీల వారు, లగడపాటి సర్వే అంటూ, రాస్తూ ఉంటారు. అయితే వీటిని అనేకసార్లు ఖండించారు లగడపాటి. నేను ఏదైనా సర్వే చేస్తే, మీడియా ముందుకు వచ్చి చెప్తా అని, ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దు అని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ లగడపాటి సర్వే అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. రాజగోపాల్ ఓ వారం కిందట ముఖ్యమంత్రి చంద్రబాబును వెలగపూడి సచివాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా, లగడపాటి సర్వే రిజల్ట్స్ ఇవ్వటానికి చంద్రబాబు వద్దకు వచ్చారనే పుకార్లు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే, లగడపాటి సర్వే వివరాలు ఇవ్వలేదు అని, కొన్ని సూచనలు చేసారని సియం పేషీ నుంచి వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రంలో టీడీపీకి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నది టీడీపీ క్యాడర్ నమ్మకమని ..ఇదే అంశం జనంలోకి కూడా వెళ్లిందని చెప్పినట్లు తెలిసింది.. పార్టీని రక్షించుకోవాలని.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే పార్టీ క్యాడర్ మహానాడుకు తరలివచ్చిందని లగడపాటి విశ్లేషించారట.. రాజధాని అమరావతి...పోలవరం నిర్మాణాలను పూర్తి చేయాలంటే చంద్రబాబు మరోసారి అధికారం చేపట్టాలన్న భావన ప్రజల్లో క్రమేణా వస్తున్నదని లగడపాటి ప్రైవేట్ చర్చల్లో చెబుతున్నారు... అయితే తెలుగదేశం పార్టీ ప్రజాప్రతినిధులపై కొన్ని ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించే విధంగా తెలుగుదేశం పనిచేయాల్సి ఉంటుందని, చంద్రబాబుపై ఉన్న సానుభూతి, రాష్ర్టం బాగుపడాలనే సెంటిమెంట్ ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతను అధిగమిస్తుందని లగడపాటి విశ్లేషిస్తున్నట్లు తెలిసింది.
ఈ సారి ఓట్లు, కులాల పోలరైజేషన్ ఎక్కువగా ఉంటుందని, బీజేపీ పై పెరుగుతున్న వ్యతిరేకత చంద్రబాబుకు అనుకూలంగా మారుతుందని పరిశీలకులు చెబుతున్నారు. పట్టణాల్లో తెలుగదేశంపార్టీకి బాగున్నప్పటికీ, పల్లెల్లో మాత్రం కొంత డల్‌గా ఉందని, ఇప్పుడిప్పుడే పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని, రోడ్లు, డ్రైనేజిలో, వ్యవసాయానికి నీరు, ఇవన్నీ పల్లెల్లో ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని, ఇలాగే పాజిటివ్ ఫీల్ కంటిన్యూ అయితే, పల్లెల్లో కూడా సంపూర్ణంగా తెలుగుదేశం వైపు మొగ్గే అవకాసం ఉంటుంది అని, అదే సమయంలో కులాల మధ్య కుంపట్లు పెట్టే కుట్రను జాగ్రత్తగా ఎదుర్కోవాలని, లగడపాటి, చంద్రబాబుకు చెప్పారని సమాచారం..