విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఈ పేరు తెలియని వారు ఉండరు.. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు ఉన్న ఆయన పేరు చెప్తే, ముందుగా గుర్తుకు వచ్చేవి సర్వే ఫలితాలు... ఆయన ఏదన్నా సర్వే చేసారు అంటే, అది నిజం అయ్యి తీరుతుంది అని అనేక సార్లు రుజువు అయ్యింది. లగడపాటి, అంత పర్ఫెక్ట్ గా సర్వే చేస్తారు... అందుకే సోషల్ మీడియాలో అన్ని పార్టీల వారు, లగడపాటి సర్వే అంటూ, రాస్తూ ఉంటారు. అయితే వీటిని అనేకసార్లు ఖండించారు లగడపాటి. నేను ఏదైనా సర్వే చేస్తే, మీడియా ముందుకు వచ్చి చెప్తా అని, ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దు అని చెప్పారు. అయితే ఇప్పుడు తెలంగాణా ఎన్నికలు వస్తూ ఉండటంతో మరోసారి, ఆయన పై ఫోకస్ పడింది.
సరిగ్గా ఇదే టైంలో లగడపాటి రాజగోపాల్ తిరుమల వచ్చారు. స్వామి వారిని దర్శనం చేసుకోవటానికి, తన కుటుంబంతో కలిసి వెంకన్న దగ్గరకు వచ్చారు. అయితే, ఇక్కడ కూడా మన మీడియా వాళ్ళు వదలరు కదా. దర్శనం అనంతరం బయటకు రాగానే, ఆయన ముందు మీడియా గొట్టాలు పెట్టి, అది చెప్పండి, ఇది చెప్పండి అంటూ హడావిడి చేసారు. ఆయన మొహమాటంగా, ఇక్కడ వద్దు వద్దు అంటున్నా, ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఈ సమయంలో అందరూ కలిసి, ఆయన పై ఒత్తిడి తెస్తూ, మీరు సర్వేలు బాగా చేస్తారు కదా, తెలంగాణా ఎన్నికలు మరో రెండు నెలల్లో వచ్చేస్తాయి, రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగారు.
పొత్తులు ఉంటే ఎలా ఉంటుంది, పోత్తులు లేకపోతే ఎలా ఉంటుంది అనే అంశం పై ప్రశ్నలు అడిగారు. దీనికి లగడపాటి సమాధానం చెప్తూ, మొదటి సారి కెసిఆర్ ని ఇక్కడే కలిసాను, తిరుమలలోనే మా మొదటి పరిచయం అయ్యింది, అలాంటిది, ఆయన గెలుస్తాడా గెలవడా అనేది ఇక్కడ చెప్తే బాగోదు, ఇక్కడ చెప్పను అంటూ వెళ్ళిపోయారు. త్వరలోనే ఆయన తెలంగాణా ఎన్నికల పై పూర్తి సమాచారం ఇస్తారని, ఆయన సన్నిహితులు చెప్పారు. అయితే, మరోసారి, తిరుమల కొండ పైనే, ఇలాంటి ప్రెస్ మీట్ లు పెట్టకూడదు అని, ఆయన మాట్లాడను అని చెప్పినా, మీడియా అత్యుత్సాహం పై విమర్శలు వస్తున్నాయి. గతంలో రోజా బూతులు ఎలా మాట్లాడిందో గుర్తు చేస్తూ, టిటిడి మీడియాను కొండ పై రాజకీయ ప్రశ్నలు అడగకుండా నిలువరించాలని కోరుతున్నారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు.. https://youtu.be/CIo-lqx6yYY