ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం వేడెక్కింది.. ప్రశాంతంగా సాగిపోతున్న రాష్ట్రంలో, ఒకదాని తరువాత మరొక సంఘటనలు చేస్తూ, లేని పోని ఉద్రిక్తతలు రేపుతున్నారు. మొన్నటిదాకా ఐటి దాడులతో హంగామా చేసి, నిన్న జగన్ పై కోడి కత్తితో గుచ్చి, అదేదో పెద్ద పోటు పొడిచినట్టు హంగామా చేస్తున్నారు. ఈ పరిస్థుతుల్లో, గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. ఏపి పై రిపోర్ట్ ఇవ్వటానికి ప్రధాని మోడీ దగరకు వెళ్లారు. ఆయనతో ఉదయం భేటీ అయ్యారు. తెలంగాణాలో ఎన్నికలు, ఏపిలో జరుగుతున్న హంగామా పై, ఆయన నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జగన్ పై కోడి కత్తితో గుచ్చి దాడి చెయ్యటం, తరువాత జరిగిన పరిణామాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు లాంటి, చంద్రబాబు ఎలా రియాక్ట్ అయ్యారు లాంటి విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది.

lagadapati 26102018 2

నిన్న చంద్రబాబు గవర్నర్ పై మొదటిసారిగా బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై కూడా, గవర్నర్, మోడీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. నిన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి ఫోన్ చేయడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నేరుగా డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. ఏమైనా వివరాలు కావాల్సి ఉంటే నేరుగా తనకు చేయాలి, కానీ డీజీపీకి ఎలా చేస్తారని చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలిసారి తాను గవర్నర్‌పై స్పందిస్తున్నానని చెప్పారు. అసలు గవర్నర్‌ పాత్ర ఏమిటి? పరుధులు ఏంటి ? ఏమి చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పాలనలో వేలుపెట్టే అధికారం గవర్నర్‌కు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో గవర్నర్‌ వ్యవస్థపైనే పోరాడామని గుర్తు చేశారు. ఎవరి తరపున ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసని, ఢిల్లీ స్క్రిప్టు ఇక్కడ అమలు చేయాలనుకుంటే కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

lagadapati 26102018 3

ఇదిలా ఉంటే.. గవర్నర్‌తో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోందోనన్న అంశంపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అసలు లగడపాటి రాజగోపాల్ ఎందుకు భేటీ అయ్యారో అని అందరూ చర్చించుకుంటున్నారు. తెలంగాణా ఎన్నికల విషయంలో లగడపాటి సర్వే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఆవ విషయం పై, గవర్నర్ పిలిపించారా అనే చర్చ జరుగుతుంది. లగడపాటి, చంద్రబాబుకి సన్నిహితంగా ఉంటున్నారు. ఒకవేళ అలా ఉండద్దు అనే సంకేతాలు ఇవ్వటానికి, గవర్నర్ పిలిపించారా అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి, గంట గంటకు ట్విస్ట్ లు తిరుగుతూ, ఏపి రాజకీయం హాట్ హాట్ గా మారిపోతుంది. చివరకు ప్రజలు, ఎలాంటి క్లైమాక్స్ రాస్తారో చూడాలి. ఇక్కడ ఎన్ని పాత్రలు ఉన్నా, క్లైమాక్స్ మాత్రం, ప్రజలే డిసైడ్ చేస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read