లగడపాటి రాజగోపాల్... ఈ పేరు తెలియని వారు ఉండరు.. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు ఉన్న లగడపాటి ఏదన్న సర్వే చేసారు అంటే, అది నిజమై తీరుతుంది... లగడపాటి, అంత పర్ఫెక్ట్ గా సర్వే చేస్తారు... సరిగ్గా ఇదే విషయాన్ని మన రాష్ట్రంలో ఉన్న ఫేక్ బ్యాచ్ ఉపయోగించుకుంది. ఒక పక్క, ఎన్ని కిలోమీటర్లు నడిచినా, మైలేజి రావటం లేదు... ప్రజల్లో జగన్ అనే వాడు ఒకడు ఉన్నాడు అనే గుర్తింపు కూడా లేదు... అందుకే కిరాయి బ్యాచ్ ని ఎదో ఒకటి చెయ్యమని, జగన్ ఆదేశించాడు... ఇంకేముంది, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ రంగంలోకి దిగింది... సర్వేలు పర్ఫెక్ట్ గా చెప్పే, మాజీ పార్లిమెంట్ సభ్యుడు, లగడపాటి రాజగోపాల్ ని ఎంచుకున్నారు..
లగడపాటికి ఉన్న ఆంధ్రా ఆక్టోపస్ నమ్మకాన్ని, వాడుకుంది జగన్ బ్యాచ్. లగడపాటి రాజగోపాల్ ఒక సర్వే చేసారు అని, వచ్చే ఎన్నికల్లో, వైసిపీకి 105 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 55 సీట్లు, జనసేనకు 15 సీట్లు వస్తాయి అంటూ, ఒక ఫేక్ సర్వే పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రమోట్ చేసింది... చివరకు జగన్ అనుకూల మీడియాలో కూడా ఈ వార్త వచ్చింది.. చాలా మంది నిజమే అని నమ్మారు కూడా... అయితే, దీని పై నిన్న ఒక పెళ్లికి వెళ్ళిన సందర్భంలో, రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు... తాను ఇప్పటి వరకు ఏ సర్వే చెయ్యలేదు అని చెప్పి, ప్రశాంత్ కిషోర్ గుట్టు రట్టు చేసారు...
ఎలక్షన్స్ ఆరు నెలలు ముందు నుంచి సర్వేలు మొదలు పెడతానని, మీకు చెప్పే ఆ పని చేస్తాను అని, రిజల్ట్స్ కూడా నేనే చెప్తానని, మీడియాకు చెప్పి, ప్రస్తుతం తన పేరు మీద జరుగుతున్న సర్వే ప్రచారం తప్పు అని చెప్పారు... అలాగే, నా పేరుతో వచ్చే ఏ సర్వే ప్రచారం నమ్మవద్దు అని, ఏదన్నా సర్వే ఉంటె నేనే స్వయంగా చెప్తానని లగడపాటి చెప్పారు.. అలాగే, తాను ఏ పార్టీలో చేరలేదు అని, చేరను అని, వ్యాపారాలు చూసుకుంటున్నా అని చెప్పారు... మొత్తానికి ప్రశాంత్ కిషోర్ ఫేక్ సర్వేలతో ప్రచారం చేస్తున్న గుట్టు రట్టు చేసారు లగడపాటి...